BREAKING
సదాశివపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా మెగా జాబ్ మేళా దేవాలయ భూముల్లో అక్రమ నిర్మాణాల ఆరోపణలు.. అధికారులకు పట్టదా..? *కంబాలపల్లిలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి భూమిపూజ* తలారి రంగయ్య పై చర్యలు తీసుకోవాలి.. చెన్నై వేదికగా భారత్-మ్యాన్మార్ సంయుక్త త్రివిధ దళాల విన్యాసాలు దీపావళి పండుగ ను ప్రశాంతంగా జరుపుకోవాలని ఎస్సై చైతన్య కిరణ్ షేర్ మొహమ్మద్ పేట లో సర్పంచ్ ఎలక్షన్ హీట్ తొలి బిమ్‌స్టెక్ సముద్ర భద్రతా విన్యాసాలు ముగింపు రైతులకు మద్దతు ధర కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం:చండూరు మార్కెట్ కమిటీ చైర్మన్ దోటి నారాయణ *సదాశివపేటలో సురక్ష మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఘన ప్రారంభం* మచ్చ బొల్లారం ట్రాన్స్‌ఫర్‌ స్టేషన్‌ తరలింపునకు కసరత్తు.. నాలుగు ప్రత్యామ్నాయ స్థలాల పరిశీలన శిరీష కు అభినందనలు వెల్లువ *సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే చింతా ప్రభాకర్* –లక్ష్మీకాంతరావు క్షమార్పణ చెప్పాలి మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడు కళ్యాణ్ రవీందర్ మురసుకు దెబ్బతిన్న ఉద్యాన పంటల పునరుద్ధరణకు చర్యలు

నేడు పలాస డివిజన్ లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఓట్ల లెక్కింపు

Select Suryaa Now
నేడు పలాస డివిజన్ లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఓట్ల లెక్కింపు

పలాస, సూర్య : పలాస డివిజన్ పరిధిలో ఇటీవల జరిగిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు శనివారం పలాస జూనియర్ కళాశాల, ఉన్నత పాఠశాల ఆవరణలో జరగనుంది. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.పలాస, వజ్రపుకొత్తూరు, మందస, సోంపేట, కవిటి, ఇచ్చాపురం, కంచిలి మండలాలకు చెందిన ఎంపీటీసీ,జెడ్పీటీసీ లెక్కింపు పలాసలోనే జరగనుంది.ఇప్పటికే బ్యాలెట్ బాక్సులు జూనియర్ కళాశాల, ఉన్నత పాఠశాలలో పోలీసు బందోబస్తు నడుమ స్ట్రాంగ్ రూంలలో భద్రపరిచారు.

132 స్థానాలకు లెక్కింపు:

పలాస డివిజన్ పరిధిలో మొత్తం 135 ఎంపీటీసీ స్థానాలు ఉండగా, కంచిలి మండలంలో 1, వజ్రపుకొత్తూరు మండలంలో 2 స్థానాలు ఏకగ్రీవం కావడంతో 132 స్థానాలకు లెక్కింపు జరగనుంది.

మండలాల వారీగా :

పలాస - 19, వజ్రపుకొత్తూరు - 19, మందస - 24, సోంపేట - 23, కంచిలి - 18, ఇచ్చాపురం - 15, కవిటి - 22 స్థానాల ఎంపీటీసీ, 7 జెడ్పీటీసీ స్థానాలకు లెక్కింపు జరుగుతుంది.ముందుగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఓట్లు వేరు చేసి మొదటి రౌండ్లో 66 స్థానాలు, రెండో రౌండ్లో 66 స్థానాలకు ఓట్ల లెక్కింపు జరుగుతుంది.

792 మంది కౌంటింగ్ సిబ్బంది :

ఒక్కో కౌంటింగ్ కేంద్రానికి సూపర్ వైజర్, అసిస్టెంట్ సూపర్ వైజర్, ముగ్గురు కౌంటింగ్ అసిస్టెంట్లు, ఒక రిజర్వు చొప్పున 132 కౌంటింగ్ కేంద్రాలకు 792 మంది కౌంటింగ్ అధికారులను నియమించారు. ఉదయం 8 గంటల నుంచి లెక్కింపు ప్రక్రియ ప్రారంభం అవుతుంది.

250 మంది పోలీసులతో బందోబస్తు :

కౌంటింగ్ సమయంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 250 మంది పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తున్నారు.

కౌంటింగ్ కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా ఎస్పీ :

పలాస జూనియర్ కళాశాల, ఉన్నత పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రాలను శుక్రవారం జిల్లా ఎస్పీ కె.వి. మహేశ్వర రెడ్డి పరిశీలించారు. ఎన్ని కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు, మండలాల వారీగా లెక్కింపు ఏర్పాట్లు, ఏజెంట్లు, మీడియా కోసం ఏర్పాట్లు తదితర అంశాలను కాశీబుగ్గ డీఎస్పీ జి.వి. రమణను అడిగి తెలుసుకున్నారు. కౌంటింగ్ కారణంగా ట్రాఫిక్ నియంత్రణ చేయాలని, ఇతర వ్యక్తులు లోపలికి రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు గట్టి బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. ఆయనతో పాటు పలాస ఆర్డీఓ అప్పలస్వామి, జిల్లా ఏఎస్పీ వివేకానంద, సీఐలు ఎం.అప్పారావు, తిరుపతిరావు తదితరులు పాల్గొన్నారు.