BREAKING
ఎమ్మెల్యేకు ఎస్సీ డిపార్ట్మెంట్ సన్మానం ప్రతి ఇంటా దీపావళి ఆనందాల వెలుగులు నింపాలి : కలెక్టర్ డా. జి.లక్ష్మీశ డ్రోన్లు, సీసీ కెమెరాలతో నిరంతర నిఘా.. ప్రశాంతంగా ఎంపీటీసీ, జడ్పీటీసీ ఓట్ల లెక్కింపు ప్రతి ఇంటా వెలుగులు నిండాలి టెక్కలిలో పసుపు జెండా రెపరెపలు గెలుపొందిన ఎస్.రాయవరం టీడీపీ జడ్పీటీసీ అభ్యర్థి రమణమ్మ! జడ్పిటిసి గా కోట నీలవేణి విజయం టెక్కలి నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వానికి ఘన విజయం గరివిడి జడ్పిటీసి గా బొత్స పూజిత విజయం జిల్లాలో మొట్టమొదటి సారిగా వికసించిన కమలం " మెలియాపుట్టిలో టీడీపీ విజయదుందుభి ఒకే ఇంట్లో రెండు జెండాలు.. సైకిల్ స్పీడ్ కు బ్రేకు వెయ్యలేకపోయిన వైసిపి కడుపునొప్పి తాళలేక వివాహిత ఆత్మహత్య ఎంపీటీసీ ఎన్నికల్లో కూటమిదే పై చేయి

–లక్ష్మీకాంతరావు క్షమార్పణ చెప్పాలి మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడు కళ్యాణ్ రవీందర్

Select Suryaa Now
–లక్ష్మీకాంతరావు క్షమార్పణ చెప్పాలి మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడు కళ్యాణ్ రవీందర్

వట్టిపల్లి;రాజకీయాల్లో ఒక నాయకుడిగా ఎదగడం, ప్రజల్లో గుర్తింపు సంపాదించడం, పదవులు చేపట్టడం అనేది ఒక్కరోజులో జరిగే ప్రక్రియ కాదు. దాని వెనుక ఎంతోమంది నాయకుల ప్రోత్సాహం, నమ్మకం, సహకారం, ఆశీస్సులు ఉంటాయి. ముఖ్యంగా రాజకీయంగా ఒక వ్యక్తిని నమ్మి బీఫాం ఇచ్చి ఎన్నికల బరిలో నిలబెట్టడం అనేది ఆ నాయకుడిపై ఉంచిన విశ్వాసానికి నిదర్శనం. అలాంటి అవకాశాన్ని కల్పించిన నాయకుడి పై నిందలు మోపడం సరియైన పద్ధతి కాదని మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడు కళ్యాణ్ రవీందర్ మండిపడ్డారు గౌరవాన్ని,రాజకీయ ప్రస్థానంలో ఆయన చేసిన సహకారాన్ని మరిచిపోయి అదే నాయకుడిపై విమర్శలకు దిగడం ఎంతవరకు సమంజసమో ఆలోచించాలి.రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ గారు రాజకీయంగా ఎంతోమందికి అవకాశాలు కల్పిస్తూ, యువ నాయకులను ప్రోత్సహిస్తూ, ప్రజాసేవలో ముందుకు తీసుకెళ్తున్న మచ్చలేని మహా  నాయకుడు. అని తెలిపారు ఆయన నమ్మకంతో, ప్రోత్సాహంతో రాజకీయంగా ఎదిగినవారు ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత కలిగి ఉంటారు. రాజకీయంగా అవకాశం కల్పించిన నాయకుడి పట్ల కనీస కృతజ్ఞత, గౌరవం చూపించకపోవడం బాధాకరం.ఒక విషయం ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి. బీఫాం ఇచ్చి ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కల్పించడం నాయకుడి గొప్పతనం; ఆ అభ్యర్థిని గెలిపించడం ప్రజల గొప్పతనం; గెలిచిన తర్వాత ప్రజలకు సేవ చేయడం ప్రజాప్రతినిధి బాధ్యత. అయితే, ఆ స్థాయికి చేరుకోవడానికి సహకరించిన నాయకుడి గౌరవాన్ని కాపాడుకోవడం కనీస రాజకీయ సంస్కారం.రాజకీయాల్లో విమర్శలు సహజం. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికీ తమ అభిప్రాయాలను వ్యక్తపరిచే హక్కు ఉంది. అయితే విమర్శలు నిర్మాణాత్మకంగా ఉండాలి. వ్యక్తిగత గౌరవాన్ని దెబ్బతీసేలా, రాజకీయంగా అవకాశం కల్పించిన నాయకుడి ప్రతిష్ఠను కించపరిచేలా వ్యవహరించడం సరైన రాజకీయ విధానం కాదు.మంత్రి దామోదర్ రాజనర్సింహ గారి రాజకీయ అనుభవాన్ని, ప్రజాసేవను, నాయకత్వాన్ని విమర్శలతో తక్కువ చేయలేరు. ఆయన నాయకత్వంపై విశ్వాసం ఉంచిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, అభిమానులు, కార్యకర్తలు ఆయన గౌరవం విషయంలో ఎల్లప్పుడూ అండగా ఉంటారు.పదవులు శాశ్వతం కాదు నమ్మకమే  ముఖ్యం  రాష్ట్ర రాజకీయ పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవు… కానీ మనకు అవకాశం ఇచ్చిన వారి పట్ల కృతజ్ఞత, గౌరవం జీవితాంతం ఉండాలి. రాజకీయంగా ఎదగడం ఎంత ముఖ్యమో, మన ఎదుగుదలకు సహకరించిన నాయకుడి గౌరవాన్ని నిలబెట్టడం కూడా అంతే ముఖ్యం.మా నాయకుడి నాయకత్వాన్ని విమర్శలతో బలహీనపరచలేరు. ఆయనపై ప్రజలు, కార్యకర్తలు ఉంచిన అభిమానాన్ని తక్కువ అంచనా వేయలేరు. రాజకీయాల్లో భిన్నాభిప్రాయాలు ఉండవచ్చు, కానీ కృతజ్ఞతను, రాజకీయ విలువలను, నాయకుల పట్ల గౌరవాన్ని ఎవరూ మరిచిపోకూడదు.అని తెలిపారు