BREAKING
సదాశివపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా మెగా జాబ్ మేళా దేవాలయ భూముల్లో అక్రమ నిర్మాణాల ఆరోపణలు.. అధికారులకు పట్టదా..? *కంబాలపల్లిలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి భూమిపూజ* తలారి రంగయ్య పై చర్యలు తీసుకోవాలి.. చెన్నై వేదికగా భారత్-మ్యాన్మార్ సంయుక్త త్రివిధ దళాల విన్యాసాలు దీపావళి పండుగ ను ప్రశాంతంగా జరుపుకోవాలని ఎస్సై చైతన్య కిరణ్ షేర్ మొహమ్మద్ పేట లో సర్పంచ్ ఎలక్షన్ హీట్ తొలి బిమ్‌స్టెక్ సముద్ర భద్రతా విన్యాసాలు ముగింపు రైతులకు మద్దతు ధర కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం:చండూరు మార్కెట్ కమిటీ చైర్మన్ దోటి నారాయణ *సదాశివపేటలో సురక్ష మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఘన ప్రారంభం* మచ్చ బొల్లారం ట్రాన్స్‌ఫర్‌ స్టేషన్‌ తరలింపునకు కసరత్తు.. నాలుగు ప్రత్యామ్నాయ స్థలాల పరిశీలన శిరీష కు అభినందనలు వెల్లువ *సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే చింతా ప్రభాకర్* –లక్ష్మీకాంతరావు క్షమార్పణ చెప్పాలి మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడు కళ్యాణ్ రవీందర్ మురసుకు దెబ్బతిన్న ఉద్యాన పంటల పునరుద్ధరణకు చర్యలు

కోటబొమ్మాళి వసతి గృహాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన జూనియర్ సివిల్ జడ్జి

Select Suryaa Now
కోటబొమ్మాళి వసతి గృహాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన జూనియర్ సివిల్ జడ్జి

​కోటబొమ్మాళి, సూర్య : కోటబొమ్మాళిలోని బాలబాలికల వసతి గృహాన్ని ఫుల్ అడిషనల్ చార్జ్ జూనియర్ సివిల్ జడ్జి కుమారి ఎం. రోషిణి శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వసతి గృహంలో అందుతున్న సౌకర్యాలు, పౌష్టికాహార పంపిణీ తీరుపై ఆమె స్వయంగా విద్యార్థులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు.​అనంతరం జడ్జి  పిల్లలకు చట్టాలపై ప్రాథమిక అవగాహన కలిగి ఉండాలని సూచించారు. ప్రస్తుత కాలంలో సోషల్ మీడియా వినియోగం, దాని వల్ల కలిగే ప్రయోజనాలు మరియు ఎదురయ్యే ముప్పుల పట్ల జాగ్రత్తగా ఉండాలని అవగాహన కల్పించారు. విద్యార్థులకు ఏవైనా సమస్యలు లేదా అత్యవసర సహాయం కావలసి వస్తే వినియోగించుకోవడానికి న్యాయసేవాధికార సంస్థ టోల్ ఫ్రీ నంబర్లను తెలియజేస్తూ, ఎల్లప్పుడూ అవసరమైన సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. ​వసతి గృహంలో ఇంకా ఏవైనా మౌలిక వసతులు కల్పించాల్సి ఉందా అని అక్కడి వార్డెన్‌ను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో కోటబొమ్మాళి న్యాయవాదుల సంఘం అధ్యక్షులు శ్రీనివాసరావు ఇతర న్యాయవాదులు, ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సిహెచ్. రమాదేవి తదితరులు పాల్గొన్నారు.