పాచిపెంట వెలుగు కార్యాలయంలో దస్త్రాలు పరిశీలన
పాచిపెంట, సూర్య : మండల కేంద్రమైన పాచిపెంట వెలుగు కార్యాలయంలో శనివారం 2025 - 26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మండల సమైక్య మరియు 36 గ్రామ సంఘాల యొక్క ఆర్థిక లావాదేవీలు పై దస్త్రాలు పరిశీలించడం జరిగిందని ఏపిఎం కే శ్రీనివాస్ రావు తెలిపారు. ఏపిఎం కే శ్రీనివాసరావు మాట్లాడుతూ మండలంలో గ్రామ సంఘాల యొక్క ఆర్థిక లావాదేవీలు కు సంబంధించి జమలు, ఖర్చులు యొక్క పత్రాలను తనిఖీ చేసినట్లు తెలిపారు. ఆడిటర్ బుగత రాజేష్ సి ఎ విశాఖపట్నం ఆధ్వర్యంలో ఆడిటర్ బృందం నగదు పుస్తకాలను, జనరల్ లేెడ్జిర్, లోన్ లేెడ్జిర్, రసీదులు బిల్లులు వోచర్లు తదితర పత్రాలను తనిఖీ చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వెలుగు కార్యాలయ సిసిలు మరియు సిబ్బంది, గ్రామైక్య సంఘాల సభ్యులు పాల్గొన్నారు.