BREAKING
వాతావరణ మార్పులపై రెండు రోజుల జాతీయ సదస్సు సదాశివపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా మెగా జాబ్ మేళా దేవాలయ భూముల్లో అక్రమ నిర్మాణాల ఆరోపణలు.. అధికారులకు పట్టదా..? *కంబాలపల్లిలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి భూమిపూజ* తలారి రంగయ్య పై చర్యలు తీసుకోవాలి.. చెన్నై వేదికగా భారత్-మ్యాన్మార్ సంయుక్త త్రివిధ దళాల విన్యాసాలు దీపావళి పండుగ ను ప్రశాంతంగా జరుపుకోవాలని ఎస్సై చైతన్య కిరణ్ షేర్ మొహమ్మద్ పేట లో సర్పంచ్ ఎలక్షన్ హీట్ తొలి బిమ్‌స్టెక్ సముద్ర భద్రతా విన్యాసాలు ముగింపు రైతులకు మద్దతు ధర కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం:చండూరు మార్కెట్ కమిటీ చైర్మన్ దోటి నారాయణ *సదాశివపేటలో సురక్ష మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఘన ప్రారంభం* మచ్చ బొల్లారం ట్రాన్స్‌ఫర్‌ స్టేషన్‌ తరలింపునకు కసరత్తు.. నాలుగు ప్రత్యామ్నాయ స్థలాల పరిశీలన శిరీష కు అభినందనలు వెల్లువ *సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే చింతా ప్రభాకర్* –లక్ష్మీకాంతరావు క్షమార్పణ చెప్పాలి మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడు కళ్యాణ్ రవీందర్

పందుల పెంపకందారుల కుటుంబాలకు ప్రత్యామ్నాయ జీవనోపాధి కల్పించాలి.. సమస్యలపై సానుకూలంగా స్పందించిన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్

Select Suryaa Now
పందుల పెంపకందారుల కుటుంబాలకు ప్రత్యామ్నాయ జీవనోపాధి కల్పించాలి.. సమస్యలపై సానుకూలంగా స్పందించిన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్
వికారాబాద్ జిల్లా ప్రతినిధి, మేజర్ న్యూస్: వికారాబాద్ మున్సిపల్ పరిధిలో పందుల పెంపకంపై ఆధారపడి జీవనం సాగిస్తున్న తమ కుటుంబాల జీవనోపాధికి భరోసా కల్పించాలని కోరుతూ సుమారు 30 కుటుంబాల సభ్యులు శుక్రవారం వికారాబాద్ పట్టణంలోని ప్రజాభవన్‌లో తెలంగాణ శాసనసభాపతి, వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా పందుల పెంపకందారులు మాట్లాడుతూ తాము ఎన్నో ఏళ్లుగా పందుల పెంపకాన్నే ప్రధాన జీవనాధారంగా చేసుకుని కుటుంబాలను పోషించుకుంటున్నామని తెలిపారు. అయితే ఇటీవల మున్సిపల్ అధికారులు పట్టణ పరిధిలో ఉన్న పందులన్నింటినీ తొలగించాలని తమకు నోటీసులు జారీ చేసినట్లు స్పీకర్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ నోటీసుల కారణంగా తమ కుటుంబాల జీవనోపాధి ప్రశ్నార్థకంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు.పందుల పెంపకం తప్ప తమకు మరో జీవనోపాధి మార్గం లేదని, ఉన్నట్టుండి ఈ వృత్తిని నిలిపివేయాల్సి వస్తే తమ కుటుంబాలు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని వివరించారు. తమ పరిస్థితిని మానవతా దృక్పథంతో పరిశీలించి, జీవనోపాధి కోల్పోకుండా ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలు లేదా ఆర్థిక సహాయం కల్పించాలని విజ్ఞప్తి చేశారు.సుమారు 30 కుటుంబాల సమస్యలను విన్న స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సానుకూలంగా స్పందించారు. తమ సమస్యల పరిష్కారంపై స్పీకర్ సానుకూలంగా స్పందించడంతో పందుల పెంపకందారులు హర్షం వ్యక్తం చేస్తూ ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.