BREAKING
పురపాలక సంఘం ఎన్నికలపై ఎంఎల్‌ఏ సమీక్ష మోదీ అభివృద్ధి, సంక్షేమ పాలనకు ఆకర్షితులై బీజేపీలో చేరిన 10 కుటుంబాలు ఇందిరమ్మ ఇళ్లును ప్రాంభించిన ఎంల్ఏ రోహిత్ రావు దలేర్ మెహందీపై అభిజీత్ భట్టాచార్య వ్యాఖ్యలు.. తీవ్రంగా స్పందించిన కుమారుడు గుర్‌దీప్! దివ్యాంగుల సమస్యల పరిష్కారానికి కృషి.. అర్హులకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యేలా చూస్తాం: స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పాత్రికేయులపై దౌర్జన్యం * సెల్‌ఫోన్లు లాక్కొన్నా చర్యల్లేవా? * టీడీపీ మున్సిపల్ చైర్మన్ త్రివేంద్ర నాయుడుకు ఘన సన్మానం బిగ్‌బాస్ సరికొత్త చరిత్ర.. అరవై రోజుల్లోనే వంద కోట్ల గంటల వ్యూయర్‌షిప్‌తో రికార్డు! కోటబొమ్మాళి వసతి గృహాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన జూనియర్ సివిల్ జడ్జి పందుల పెంపకందారుల కుటుంబాలకు ప్రత్యామ్నాయ జీవనోపాధి కల్పించాలి.. సమస్యలపై సానుకూలంగా స్పందించిన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ టైగర్ ష్రాఫ్ తీవ్ర ఒత్తిడిలో ఉన్నాడు.. ఫైరింగ్ ఘటన తర్వాత కోలుకునేందుకు ప్రయత్నిస్తున్నాడన్న విద్యుత్ జమ్వాల్! నేడు పలాస డివిజన్ లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఓట్ల లెక్కింపు పాచిపెంట వెలుగు కార్యాలయంలో దస్త్రాలు పరిశీలన సీఐఐ సదస్సు ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించిన స్పెషల్ సీఎస్ ఎస్.ఎస్. రావత్ ఘనంగా శ్రీ ధన్వంతరి నారాయణ జయంతి వేడుకలు.

దీపావళి వేళ పేకాట ఆడితే కఠిన చర్యలు సీఐ వెంకటరెడ్డి

Select Suryaa Now
దీపావళి వేళ పేకాట ఆడితే కఠిన చర్యలు సీఐ వెంకటరెడ్డి

నారాయణఖేడ్ నియోజకవర్గ పరిధిలోని కంగ్టి మండల కేంద్రంలో శుక్రవారం కంగ్టి సర్కిల్ ఇన్‌స్పెక్టర్ వెంకట్ రెడ్డి ఒక ప్రకటన విడుదల చేశారు. దీపావళి పండుగ సందర్భంగా కంగ్టి, సిర్గాపూర్, కల్హేర్ మండలాల ప్రజలు పేకాటకు దూరంగా ఉండాలని హెచ్చరించారు. ఎవరైనా పేకాట ఆడినా, నిర్వహించినా కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. గ్రామాల్లో పేకాట నిర్వహించేందుకు స్థలం ఇచ్చిన యజమానులపై కూడా చర్యలు తీసుకుంటామని తెలిపారు. పేకాట వల్ల కుటుంబాలు ఆర్థికంగా నష్టపోవడమే కాకుండా, అప్పులపాలై కుటుంబాల్లో గొడవలు, ఇతర సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. కొందరు జూదం, మద్యానికి బానిసలై జీవితాలను నాశనం చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కావున ప్రజలు పేకాటకు దూరంగా ఉండి దీపావళి పండుగను ప్రశాంతంగా, ఆనందంగా జరుపుకోవాలని సీఐ సూచించారు. గ్రామాల్లో ఎక్కడైనా పేకాట నిర్వహిస్తున్నట్లు తెలిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచుతామని భరోసా ఇచ్చారు.