మోదీ అభివృద్ధి, సంక్షేమ పాలనకు ఆకర్షితులై బీజేపీలో చేరిన 10 కుటుంబాలు
హిందూపురం:- ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పాలనకు ఆకర్షితులై హిందూపురం పట్టణంలోని 32వ వార్డు బోయపేటకు చెందిన 10 కుటుంబాలు భారతీయ జనతా పార్టీలో చేరాయి.బీజేపీ జిల్లా కార్యదర్శి రమ్య ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయా కుటుంబాలు పార్టీ ప్రాథమిక సభ్యత్వాన్ని స్వీకరించాయి. ఈ సందర్భంగా హిందూపురం అసెంబ్లీ కన్వీనర్ ఆదర్శ్ కుమార్ నూతనంగా పార్టీలో చేరిన కుటుంబాలకు పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశవ్యాప్తంగా అమలవుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు, సుపరిపాలనకు ఆకర్షితులై ప్రజలు బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నారని అన్నారు. దేశ అభివృద్ధి కోసం మోదీ చేస్తున్న కృషిని ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు, హిందూపురంలో పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో లేపాక్షి మండల మాజీ అధ్యక్షులు బద్రి, బీజేపీ సీనియర్ నాయకులు నాగరాజు తదితరులు పాల్గొన్నారు…
హిందూపురం సూర్య స్టాప్ రిపోర్టర్ నాగేంద్ర