చీకురాయి లో ' ప్యారడైజ్' సినిమా డైరెక్టర్ శ్రీకాంత్...
సూర్య - పెద్దపల్లి రూరల్ : మండలం లోని చీకురాయి లో గ్రామంలో శుక్రవారం ' ప్యారడైజ్' సినిమా డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల తన స్వగ్రామం కు విచ్చేశారు. ఈ సందర్భంగా మున్నూరు కాపు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎల్ రాజయ్య, రాష్ట్ర కార్యదర్శి రామస్వామి, ఆర్గనైజింగ్ సెక్రటరీ మాజీ జడ్పీటీసీ రామ్మూర్తి, జిల్లా అధ్యక్షులు జడల సురేందర్ లు సినిమా డైరెక్టర్ శ్రీకాంత్ ను డైరెక్టర్ సోదరుడు శశికాంత్, తల్లిదండ్రులు ఓదెల చంద్రయ్య తార ల కు శాలువ కప్పి ఘనంగా సన్మానించారు. ప్యారడైజ్ మూవీ హిట్ తర్వాత స్వగ్రామం కు రావడం పట్ల వారు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఓదెల శ్రీనివాస్, మాజీ సర్పంచ్ గాండ్ల మల్లేశం, పూదరి మహేందర్, బండారి సదయ్య, రాజేష్, విక్రాంత్, పెంచాల శ్రీకాంత్, సతీష్ , బండారి చంద్రహాస్ తదితరులు ఉన్నారు.