పురపాలక సంఘం ఎన్నికలపై ఎంఎల్‌ఏ సమీక్ష
గూడూరు, మేజర్‌న్యూస్ : గూడూరు పురపాలక సంఘానికి జరగనున్న ఎన్నికలపై శాసన సభ్యులు, టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మరియుఅసెంబ్లీ అంచనాల కమిటీ సభ్యులు డాక్టర్ పాశిం సునీల్ కుమార్ సమీక్షించారు. ఈనెల 17న సూప్రీంకోర్టు తీర్పు అనంతరం రెండో విడతలో మునిసిపల్ ఎలక్షన్స్‌కు నోటిఫికేషన్ రానున్నట్లు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో క్యాంప్ కార్యాలయంలో పట్టణం పరిధిలోని నాయకులతో సమీక్షా సమావేశం నిర్వహించి మునిసిపల్ ఎలెక్షన్‌పై అందరూ సన్నదం కావాలని, కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమలను ప్రజలలోకి తీసుకెళ్లి కూటమి ఆభర్థులను అఖండ మెజారిటీతో గెలిపించుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో సీనియర్ నాయకులు శీలం కిరణ్‌కుమార్, రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శి బిల్లు చెంచురామయ్య, కార్యదర్శి మట్టం శ్రావణి, పట్టణ అధ్యక్షులు పులిమి శ్రీనివాసులు, జిల్లా అధికార ప్రతినిధి అబ్దుల్‌రహీం, మస్తాన్‌నాయుడు, చంద్రమౌళినాయుడు, వాటంబేటి శివకుమార్, నెలబల్లి బాస్కర్‌రెడ్డి, కిడిపర్తి కల్పన, గుండాల భారతి పెద్ద సంఖ్యలో నాయకులు కార్యకర్తుల పాల్గొన్నారు.