విద్యార్థులకు ఉపన్యాస పోటీలు
పాలమూరు మేజర్ న్యూస్ -
బీసీ మేధావుల సంఘం మరియు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పండుగ సాయన్న జీవిత చరిత్ర,మరియు జయంతిని పురస్కరించుకొని డ్రాయింగ్ మరియు ఉపన్యాస పోటీలను నవంబర్ 7 న ఉదయం 9 గంటలకు మహబూబ్నగర్ పట్టణంలోని క్రౌన్ గార్డెన్ ఫంక్షన్ హాల్ లో నిర్వహిస్తామని బీసీ మేధావుల సంఘం తెలిపింది.జూనియర్స్ విభాగంలో 6 మరియు 7 వ తరగతి విద్యార్థులు ,సీనియర్స్ విభాగం 8, 9 మరియు 10 వ తరగతి విద్యార్థులకు డ్రాయింగ్ మరియు ఉపన్యాస పోటీలు నిర్వహిస్తామని బీసీ మేధావుల సంఘం ప్రధాన కార్యదర్శి ఎన్ ప్రభాకర్ ఒక ప్రకటనలో తెలియజేశారు.
ఎం.ఓం ప్రకాష్ మహబూబ్ నగర్