మునుగోడు ప్రజలు ఏం పాపం చేశారు.. మాకెందుకు నిధులు రావు:మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి
మునుగోడు ప్రజలు ఏం పాపం చేశారు.. మాకెందుకు నిధులు రావు:మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి
????ఎంపిపిఎస్ ప్రధానోపాధ్యాయులు సుంకరి బిక్షం గౌడ్ కు ఘన సన్మానం
????ఉద్యోగ విరమణ శుభాకాంక్షలు తెలిపిన పలువురు ప్రజా ప్రతినిధులు
మునుగోడు,మేజర్ న్యూస్:
మునుగోడు ప్రజలు ఏం పాపం చేశారు మాకెందుకు నిధులు రావు అని మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు.శనివారం మండల కేంద్రంలోని పిఆర్ఆర్ గార్డెన్లో పిఆర్టియు టీఎస్ రాష్ట్ర సంఘం మాజీ అధ్యక్షుడు మరియు మునుగోడు ఎంపిపిఎస్ ప్రధానోపాధ్యాయులు సుంకరి బిక్షం గౌడ్ ఉద్యోగ విరమణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై, బిక్షం గౌడ్ కు ఉద్యోగ విరమణ శుభాకాంక్షలు తెలిపినారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కమిట్మెంట్ ఉంటే ఏ పనైనా చేయొచ్చున్నారు.
కృషి, పట్టుదల, దీక్షకు మారుపేరు బిక్షం గౌడ్ అన్నారు. ఉపాధ్యాయుడుగా కమిట్మెంట్తో పని చేస్తూ ఇంటింటికి తిరిగి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను పెంచడంలో ఆయన కృషి చాలా ఉందన్నారు.ఇటువంటి వ్యక్తులకు రిటైర్మెంట్ అనేది ఉండదన్నారు. సమాజంలో అవినీతి పేరుకు పోతుందనీ ఆవేదన వ్యక్తం చేశారు. అవినీతి పారద్రోలేంత వరకు పేదలకు న్యాయం జరగదన్నారు. నాయకుడనేవాడు నీతిగా ఉంటే సమాజానికి నీతి వంతమైన పాలన అందించగలరు అని స్పష్టం చేశారు.కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీ అని, బడుగు బలహీన వర్గాల పార్టీ అన్నారు.బీసీలకు పెద్దపీట వేయాలని ఉద్దేశంతోనే బీసీ బిడ్డ అయిన సుంకర బిక్షం గౌడ్ కి ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వాలని చెప్పానని తెలిపారు.ప్రజలే న్యాయ నిర్నేతలు కాబట్టి ప్రజల నిర్ణయానికి వదిలేయాలన్నారు.
9,000 కోట్లతో కొడంగల్లో సీఎం అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తున్నారన్నారు.కొడంగల్ కి అభివృద్ధి పనులు ఇవ్వొద్దనేది నా ఉద్దేశం కాదన్నారు.ప్రపంచంలోనే అత్యధికంగా ఫ్లోరైడ్ తో బాధపడుతున్న మునుగోడు నియోజకవర్గం అభివృద్ధి చేసుకోవాలన్న తపన ఉందన్నారు.
ఎమ్మెల్యేల నియోజకవర్గాలను కూడా ముఖ్యమంత్రి, మంత్రులు సమానంగా చూడాలనీ హితవు పలికారు.ముఖ్యమంత్రి దగ్గరికి ఉప ముఖ్యమంత్రి బట్టి దగ్గరికి చాలాసార్లు వెళ్లాననీ తెలిపారు.ప్రభుత్వం ఇప్పటికైనా గ్రహించి మునుగోడుతో పాటు వెనుకబడిన నియోజకవర్గంలను గుర్తించి ఆ నియోజకవర్గాలకు న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పింగళి శ్రీపాల్ రెడ్డి, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్, ఉమ్మడి నల్లగొండ జిల్లా డిసిసిబి మాజీ చైర్మన్ కుంభం శ్రీనివాస్ రెడ్డి,మండల విద్యాధికారి తలమల్ల మల్లేశం,పిఆర్టియు అధ్యక్షుడు యూసుఫ్ పాష, గోడ్డేటి నరసింహ, పిఆర్టియు సంఘం నాయకులు, పలువురు ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.
కె ఇంద్రసేనారెడ్డి, మేజర్ న్యూస్,మునుగోడు నల్గొండ