భట్టిప్రోలు మండలం లో తెలుగుదేశం పార్టీ విజయ దుందుభి
భట్టిప్రోలు, మేజర్ న్యూస్:
భట్టిప్రోలు మండలంలో గత 5వ తేదీన జరిగిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలలు జరుగగా, శనివారం జరిగిన ఓట్ల లెక్కింపులో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు విజయ దుందుభి మోగించారు. మండల పరిధిలో 14 ఎంపీటీసీ సెగ్మెంట్ల గాను 14 సెగ్మెంట్లను తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంది. మండల కేంద్రమైన భట్టిప్రోలు లోని నాలుగు సెగ్మెంట్లు తెలుగుదేశం అభ్యర్థులు విజయం సాధించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలకు ధన్యవాదాలు తెలిపే కార్యక్రమంలో భాగంగా స్థానిక మార్కెట్ యార్డు వద్ద నుండి టిడిపి శ్రేణులు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యదర్శి తూనుగుంట్ల సాయిబాబా ఆధ్వర్యంలో సెగ్మెంట్ అభ్యర్థులు కట్ట కృష్ణ, మండ్రు సునీల్ బాబు, గాత్రం సౌమ్యశ్రీ, కటకం కుమారస్వామి లతో కలసి విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాయకులు డొక్కు శ్రీనివాసరావు, బట్టు మల్లికార్జున రావు, ఎర్రంశెట్టి కరుణ శ్రీనివాసరావు, గాత్రం భావనారాయణ పలువురు టిడిపి, జనసేన, బిజెపి నాయకులు పాల్గొన్నారు.