మెలియాపుట్టి జడ్పీటీసీగా బమ్మిడి చామంతి ఘన విజయం
మెలియాపుట్టి, సూర్య : మెలియాపుట్టి జడ్పీటీసీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బొమ్మిడి చామంతి అఖండ విజయం సాధించారు. వైఎస్సార్‌సీపీ అభ్యర్థిపై 2,867 ఓట్ల భారీ మెజార్టీతో గెలుపొందారు. ఈ విజయంతో టీడీపీ శ్రేణుల్లో నూతనోత్సాహం నెలకొంది. ఆమె స్వగ్రామమైన సంతలక్ష్మీపురంలో పండగ వాతావరణం నెలకొంది.కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలతో పాటు పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు నియోజకవర్గ అభివృద్ధికి చేస్తున్న కృషిపై ప్రజలు విశ్వాసం ప్రకటించారని కూటమి నాయకులు పేర్కొన్నారు. ప్రభుత్వ పనితీరుకు, ఎమ్మెల్యే అభివృద్ధి కార్యక్రమాలకు ప్రజలు ఈ ఎన్నికల ద్వారా మద్దతు తెలిపారని వారు అభిప్రాయపడ్డారు.బమ్మిడి చామంతి భారీ మెజార్టీతో విజయం సాధించడంతో కూటమి నాయకులు, కార్యకర్తలు ఆనందోత్సాహాలతో సంబరాలు నిర్వహించారు. ఈ ఫలితం మెలియాపుట్టి మండలంలో టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపింది.