మంజీర విద్యాలయం లో దీపావళి వేడుకలు ఘనంగా నిర్వహించారు
రామాయంపేట;రామాయంపేట మున్సిపాలటి లోని మంజీర విద్యాలయంలో ముందస్తుగా దీపావళి సంబరాలను అంబరాన్నంటే విధంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వాసవి మాట్లాడుతూ దీపావళి పర్వదినం గురించి విద్యార్థిని విద్యార్థులకు వివరించడం జరిగింది. భారతీయ సంస్కృతికి ప్రతిబింబంగా వెలుగొందేవే భారతీయ పండుగలు. దివ్యకాంతుల దీపావళి జగతిని జాగృతం చేసే చైతన్య దీప్తుల శోభావళి. నరకాసురుడు అనే రాక్షసుడుని సంహరించిన మరుసటి రోజు అతడి పీడ వదిలిన ఆనందంలో ప్రజలు దీపావళి చేసుకుంటారని పురాణాలు చెబుతున్నాయి. అలాగే లంకలోని రావణుడిని సంహరించి శ్రీరాముడు సతీసమేతంగా అయోధ్యకు తిరిగి వచ్చినప్పుడు కూడా ప్రజలు ఆనంద ఉత్సాహం మధ్య దీపావళిని జరుపుకున్నారని రామాయణం చెప్తుంది. చీకటిని పారద్రోలుతూ వెలుగులు తెచ్చే పండగ విజయానికి ప్రత్యేకగా దీపావళి పండుగ జరుపుకుంటారు. ప్రతి సంవత్సరం ఆశ్వయుజ అమావాస్య రోజున దీపావళి జరుపుకుంటారు. ముందు రోజు నరక చతుర్దశి జరుపుకుంటారు. దీపమాలికల శోభలతో వెలుగొందే గృహాలు ఆనంద కోలాహాలంతో వెలివేసే ఆబాల గోపాలం, నూతన వస్త్రాల రెపరెపలు ,పిండి వంటల గుమగుమలు బాణాసంచా చప్పులు ఈ దివ్య దీపావళి సోయగాలు .దీపం జ్యోతి: పరబ్రహ్మ దీపం సర్వతా మోపహమ్ దీపేన సాధ్యతే సర్వం సంధ్యా దీప నమో స్తుతి. దీపం బ్రహ్మత్వం మనోవికాసానికి, ఆనందానికి, నవ్వులకు, సజ్జనత్వానికి ,సద్గుణ సంపత్తికి నిదర్శనంగా దీపాన్ని భావిస్తారు. అందుకే మహిళా మణులంతా ఆశ్వయుజ బహుళ చతుర్దశి నుంచి కార్తీక మాసం అంతా మట్టి ప్రమిదలలో దీపాలను వెలిగిస్తారు. ఇది సౌభాగ్యానికి, సౌజన్యానికి, సౌశీల్యానికి , ప్రత్యేకంగా భావిస్తారు. దీపావళి రోజున మహాలక్ష్మి పూజను జరుపుకోవడానికి ఓ విశిష్టత ఉంది .శ్రీహరి వద్ద ఎప్పుడూ ఉండడం న్యాయమా అని ఇంద్రుడు లక్ష్మీదేవిని ప్రశ్నించగా, నన్ను త్రికరణ శుద్ధిగా ఆరాధించే భక్తులకు నేను అనుగుణంగా మహర్షులకు మోక్షలక్ష్మి రూపంగా, విజయాన్ని కోరేవారికి విజయలక్ష్మి గా, విద్యార్థులు నన్ను ఆరాధిస్తే విద్యాలక్ష్మిగా, ఐశ్వర్యాన్ని కోరి ఆరాధించే వారికి ధనలక్ష్మిగా ,వారి సమస్త కోరికలు నెరవేర్చి వరలక్ష్మి దేవిగా ప్రసన్నరాలవుతానని సమాధానమిచ్చింది. అందుచేత దీపావళి రోజున మహాలక్ష్మిని పూజించే వారికి సర్వసంపదలు చేకూరుతాయని విశ్వాసం లక్ష్మీ పూజలు నిర్వహించి దీపాలు వెలిగించి టపాకాయలు కాల్చి పాఠశాలలో దీపావళి సంబరాలు నిర్వహించడం జరిగింది .ఇందులో పాఠశాల కరస్పాండెంట్ జితేందర్ రెడ్డి వాసవి, ప్రిన్సిపల్ సురేష్ , సంధ్య, భావన మీనా , అనిల్ ,శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు.