ప్రజల జీవితాల్లో దీపావళి కొత్త వెలుగులు నింపాలి – జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటీల్
చెడుపై మంచి, దుష్టశక్తులపై దైవశక్తి సాధించిన విజయానికి ప్రతీకగా దీపావళి పండుగను జరుపుకుంటామని జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటీల్ అన్నారు.
శనివారం జిల్లా కలెక్టరేట్‌లో ఆయన మాట్లాడుతూ.. దీపావళి పండుగ ప్రజల జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని ఆకాంక్షించారు. ప్రతి ఒక్కరూ మంచి ఆలోచనలతో ముందుకు సాగుతూ, ఇతరులకు మేలు చేసే విధంగా జీవించాలని సూచించారు.
ప్రజల జీవితాల్లోని కష్టాల చీకట్లు తొలగిపోయి, ప్రతి ఇంటా సుఖసంతోషాలు, సిరిసంపదలు వెల్లివిరియాలని ఆకాంక్షించారు. చిన్నా పెద్దా తేడా లేకుండా అందరూ దీపావళిని ఆనందంగా జరుపుకోవాలని, అదే సమయంలో ప్రమాదాలకు తావులేకుండా ప్రభుత్వం సూచించిన భద్రతా నిబంధనలు పాటించాలని సూచించారు.
దీపావళి పండుగ ప్రతి ఒక్కరి జీవితాల్లో ఆనందోత్సాహాలను నింపాలని, నాగర్ కర్నూల్ జిల్లా ప్రజలందరికీ హృదయపూర్వక దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఇంటా సిరిసంపదలు, సుఖసంతోషాలు వెల్లివిరియాలని, కోటి ఆనంద దీపాలు వెలగాలని జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటీల్ ఆకాంక్షించారు.
సందడి రవీందర్ రెడ్డి,నాగర్ కర్నూల్, రూరల్, సూర్య న్యూస్