ఏఎస్ డీడీ (గైర్హాజరు, వలస, మరణం, డబుల్ వచ్చిందా లేదా జాబితాలోని ఓటర్లకు మరో అవకాశం
ఏఎస్ డీడీ (గైర్హాజరు, వలస, మరణం, డూప్లికేట్ జాబితాలోని ఓటర్లకు మరో అవకాశం
ఎన్యుమరేషన్ ఫారాల సమర్పణకు ఎన్నికల సంఘం వెసులుబాటు
కందుకూరు:
వివిధ కారణాలతో ఏఎస్ డీడీ (గైర్హాజరు, వలస, మరణం, డబుల్ ) జాబితాలో చేరిన ఓటర్లకు మరోసారి ఎన్యుమరేషన్ ఫారాలు సమర్పించేందుకు ఎన్నికల సంఘం అవకాశం కల్పించినట్లు మహేశ్వరం నియోజకవర్గ ఎన్నికల నమోదు అధికారి, ఆర్డీవో జగదీశ్వర్ రెడ్డి తెలిపారు.
ఏఎస్ డీడీ ( ఈఆర్ ఓ , ఏఈ ఆర్ ఓ )కార్యాలయాలతో పాటు అన్ని పోలింగ్ కేంద్రాల్లో ప్రదర్శించనున్నట్లు పేర్కొన్నారు. మహేశ్వరం నియోజకవర్గంలోనే నివసిస్తున్న వారు ఎన్యుమరేషన్ ఫారంతో పాటు Annexure-Bను, ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన వారు Annexure-Cను సంబంధిత BLO లేదా ఎన్నికల అధికారులకు సమర్పించవచ్చని తెలిపారు.ఈ అవకాశంపై రాజకీయ పార్టీల బూత్ స్థాయి ఏజెంట్ల సహకారంతో ప్రజలకు అవగాహన కల్పించాలని, పత్రికలు, సోషల్ మీడియా ద్వారా విస్తృత ప్రచారం చేయాలని అధికారులకు సూచించారు. అర్హులైన ఓటర్లు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని అవసరమైన పత్రాలతో ఫారాలను సమర్పించాలని జగదీశ్వర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.
టి. శ్రీనివాస్, మేజర్ న్యూస్