పండుగ సాయన్న జీవితం అందరికీ ఆదర్శం
పాలమూరు మేజర్ న్యూస్ -
బీసీ మేధావుల సంఘం మరియు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం మహబూబ్నగర్ పట్టణంలోని క్రౌన్ గార్డెన్ ఫంక్షన్ హాల్ లో పండుగ సాయన్నజీవిత చరిత్ర పైన డ్రాయింగ్ మరియు ఉపన్యాస పోటీలు ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమములో వివిధ మండలాల నుంచి 400 మంది విద్యార్థులు పోటీలలో పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మైనార్టీ తెలంగాణ రాష్ట్ర కార్పోరేషన్ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్ పాల్గొన్నారు .వారు మాట్లాడుతూ ,పండుగ సాయన్న ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వాసి పండుగ సాయన్న చరిత్రను అందించిన వ్యక్తి నవలా రచయిత బెక్కం జనార్ధన్ కండంతరాల వరకు పండుగ సాయన్న చరిత్రను అందించిన గొప్ప వ్యక్తి అని అదేవిధంగా ఈ కార్యక్రమం బీసీ మేధావుల సంఘం మరియు ఉమ్మడి మహబూబ్నగర్ ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ తరపున ఘనంగా నిర్వహించుకోవడం ఇది కూడా ఇంతవరకు ఉపన్యాసాల పోటీలు డ్రాయింగ్ పోటీలను నిర్వహించిన మొట్టమొదటి వ్యక్తులు ప్రభాకర్ అని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో నవలా రచయిత బెక్కం జనార్ధన్ మాట్లాడుతూ,తన నవలను వారం రోజుల్లో ఇంత గొప్పగా విద్యార్థులు ఉపన్యాసం చేస్తూ ఉంటే ఆ కథలో నేను మైమరిచిపోయానని విద్యార్థుల యొక్క భాష నిజంగా గ్రామీణ భాషలో మాట్లాడుతూ ఉంటే తనకు ఎంతో ఆనంద కలిగింది అన్నారు.తన పుస్తకానికి ఇంత బలం ఉందా అని విద్యార్థులు చక్కగా రాణించాలని వారు కొనియాడారు. ఈ కార్యక్రమంలో మాజీ సంగీత నాటక అకాడమీ రాష్ట్ర చైర్మన్ బాద్మీ శివకుమార్ మాట్లాడుతూ ,నవలా రూపంలో మొదలైన పండుగ సాయన్న ఈరోజు రవీంద్ర భారతి నాటకం అదేవిధంగా విద్యార్థుల లోకంలో ఉపన్యాస పోటీలు డ్రాయింగ్ కాంపిటీషన్ నిర్వహించడం ఇది ఒక చరిత్ర అని వారు కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ అధ్యక్షులు ప్రభాకర్ మాట్లాడుతూ ,పండుగ సాయన్న చరిత్ర నిలిచిపోవాలని నేటి బాలలే రేపటి పౌరులు కనుక వారి నుంచే పండుగ సాయన్న చరిత్ర గ్రామ గ్రామాల్లో తెలియజేసే ప్రయత్నం చేయడం జరిగిందని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపన్యాస పోటీలలో మొదటి బహుమతి జూనియర్స్ విభాగం సాయి ప్రేక్ష ,ద్వితీయ బహుమతి ముబాశిర ,మూడో బహుమతి అనన్య సత్యవతి . సీనియర్ విభాగంలో మొదటి బహుమతి వీరేంద్ర, రెండో బహుమతి తమన్న ,మూడో భూమతి ,లాస్య ,చైతన్య. డ్రాయింగ్ కాంపిటీషన్లో జూనియర్ విభాగంలో మొదటి బహుమతి చైతన్య ,రెండవ బహుమతి రూప ,మూడో బహుమతి అఖిలానందన్ ,జాహ్నవి. సీనియర్ విభాగంలో మొదటి బహుమతి అక్షిత ,రెండవ బహుమతి అబ్దుల్ ముజామిన్ ,మూడో బహుమతి అక్షిత వీరందరికీ ముఖ్య అతిథి చేతి మీదుగా మేమెంటో సర్టిఫికెట్లను అందజేశారు.ఈ కార్యక్రమంలో బీసీ మేధావుల సంఘం మహిళా అధ్యక్షురాలు జమున ,వనజ ,భాస్కర్ ,అంజిరెడ్డి ,రామచందర్ ,భాను ,రవికుమార్ ,మల్లికార్జున్ ,న్యాయ నిర్ణేతలుగా భీంపల్లి శ్రీకాంత్ ,మహేందర్ పాల్గొన్నారు.
ఎం.ఓం ప్రకాష్ ,మహబూబ్ నగర్