BREAKING
భట్టిప్రోలు మండలం లో తెలుగుదేశం పార్టీ విజయ దుందుభి కాలిఫోర్నియా పోర్టుల కాంట్రాక్టు చర్చలు పొడిగింపు పరాగ్వే మాజీ అధ్యక్షుడు శాంటియాగో పెన్యాపై విచారణ దక్షిణ అమెరికా పర్యటనలో పాప్ లియో ప్రజలందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలు : కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు సముద్ర దిగ్బంధానికి తోడుగా సరిహద్దు వాణిజ్యంపై ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు విశాఖ యువకులను క్షేమంగా స్వదేశానికి చేరుస్తాం : కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు కొత్తూరు జడ్పిటిసి గా టిడిపి అభ్యర్థి లోతుగెడ్డ శ్రీదేవి గెలుపు పండుగ సాయన్న జీవితం అందరికీ ఆదర్శం నెల్లిమర్లలో కూటమి హవా.. *ఎంపీటీసీ ఎన్నికల్లో సత్తా చాటిన టీడీపీ, జనసేన * జడ్పిటిసిగా టిడిపి అభ్యర్థి వెంకటమ్మ ఘన విజయం ఎంపీటీసీలుగా తల్లీకూతుళ్ల ఘన విజయం చైర్మన్ వర్గం లోపారి ఒప్పందమే శంబరలో అభ్యర్థి ఓటమి.? జడ్పీటీసీ, ఎంపీటీసీ ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్, ఎస్పీ పాలకొండ జడ్పిటిసి గా వెంకట్రావు

బీఆర్ఎస్ పాపానికే మేడిగడ్డ కూలింది

Select Suryaa Now
బీఆర్ఎస్ పాపానికే మేడిగడ్డ కూలింది

హైదరాబాద్: గత బీఆర్ఎస్ ప్రభుత్వ నిర్లక్ష్యం, చేసిన పాపాల వల్లే మేడిగడ్డ బ్యారేజీ కూలిపోయిందని రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. మేడిగడ్డ దగ్గర బ్యారేజీ దెబ్బతినడం వల్లే కన్నెపల్లి వద్ద పంపులు పనిచేయని పరిస్థితి ఏర్పడిందని ఆయన స్పష్టం చేశారు. మేడిగడ్డలో కనీసం 16 టీఎంసీల నీటి మట్టం ఉంటేనే కన్నెపల్లి నుంచి నీటిని ఎత్తడానికి సాధ్యమవుతుందని, అంతేకాకుండా అన్నారం, సుందిళ్ల వద్ద గేట్లు దించకపోతే ఆ నీళ్లన్నీ మళ్లీ మేడిగడ్డకే చేరుకుంటాయని ఆయన వివరించారు. గత ప్రభుత్వ వైఫల్యం వల్ల కరువు సమయంలో రైతులకు సరిపడా నీళ్లు ఇవ్వలేకపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. రాబోయే డిసెంబర్‌లో శాసనసభలో కాళేశ్వరం ప్రాజెక్టుపై సమగ్రమైన చర్చ జరుపుదామని, అలాగే ఎల్‌నినో ప్రభావంపై కూడా రెండు మూడ్రోజుల పాటు చర్చ చేపట్టాలని స్పీకర్‌ను కోరుతున్నట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు.