BREAKING
ఎమ్మెల్యే అమర్ ను కలసిన చిత్తూరు మేయర్ కటారి హేమలత ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు కోహెడ ఎస్సై అభిలాష్ న్యాయవాది మంద నగేష్ కుటుంబానికి మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పరామర్శ.. లక్ష్మమ్మ పార్థివదేహానికి ఘన నివాళి న్యూజిలాండ్ టెస్ట్ టూర్ కి మహమ్మద్ షమీని ఎంపిక చేయాల్సి ఉండింది: మాజీ కోచ్ రవిశాస్త్రి సంచలన వ్యాఖ్యలు మున్సిపల్ వైస్ చైర్మన్ బుచ్చేష్ యాదవ్ ను సన్మానించిన లాయర్లు.. మంజీర విద్యాలయం లో దీపావళి వేడుకలు ఘనంగా నిర్వహించారు మండల ఎంపీపీ అభ్యర్థికి సౌమ్యశ్రీ కి 1033 ఓట్ల ఆధిక్యం గుర్నూర్ బ్రార్ దగ్గర మంచి పేస్, బౌన్స్ ఉన్నాయి.. స్థిరత్వమే ముఖ్యం: శ్రేయస్ అయ్యర్ ఆసక్తికర వ్యాఖ్యలు నొవార్టిస్, నోవో నార్డిస్క్ గుండె మందుల ట్రయల్స్ విఫలం పోలాండ్‌లోని క్రాకోవ్‌లో ఘోర కాల్పులు బంతితో సంగీతం పలికించిన మహమ్మద్ షమీ: టెస్ట్ క్రికెట్ అసలు సిసలు మజా ఇదే! స్టైల్ మార్చలేదు.. మైండ్‌సెట్ మార్చుకున్నాడు: కొత్త రూపంలో అదరగొడుతున్న ఇషాన్ కిషన్! శ్రీకాళహస్తి నియోజకవర్గంలో వికసించిన కమలం గ్రేట్ కమ్‌బ్యాక్‌తో చెలరేగిన వైష్ణవి శర్మ: ఒకే ఓవర్‌లో 4 వికెట్లతో సరికొత్త చరిత్ర! వర్షంతో ముగిసిన రెండో వన్డే: న్యూజిలాండ్‌పై డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో భారత్ విజయం.. సిరీస్‌లో 2-0 ఆధిక్యం

జడ్పిటిసిగా టిడిపి అభ్యర్థి వెంకటమ్మ ఘన విజయం

Select Suryaa Now
జడ్పిటిసిగా టిడిపి అభ్యర్థి వెంకటమ్మ ఘన విజయం

గరుగుబిల్లి, సూర్య : స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార కూటమి పార్టీ తన జనాదరణను మరోసారి నిరూపించుకుంది. తెలుగుదేశం పార్టీ తరుపున జడ్పిటిసి అభ్యర్థిగా పోటీ చేసిన కారాడ వెంకటమ్మ విజయం సాధించారు.ఈ మేరకు శనివారం జడ్పిటిసి ఎన్నికలకు సంబంధించి జరిగిన కౌంటింగ్ ప్రక్రియలో గరుగుబిల్లి మండల జడ్పిటిసి అభ్యర్థిగా పోటీ చేసిన కారాడ వెంకటమ్మ 5,495 ఓట్లు మెజార్టీతో ఘన విజయం సాధించారు.కౌంటింగ్ కేంద్రం నుండి అధికారికంగా ఫలితం వెలువడగానే తెలుగుదేశం పార్టీ శ్రేణులు, నాయకులు, మరియు అభిమానులు పెద్ద ఎత్తున సంబరాలు నిర్వహించుకున్నారు.
ఈ విజయప్రస్థానంపై గెలుపొందిన జడ్పిటిసి అభ్యర్థి మాట్లాడుతూ ఈవిజయం తనది కాదని, మండలాభివృద్ధిని కాంక్షించి ఓట్లేసిన ఓటర్లదేనని పేర్కొన్నారు.పార్టీ అధిష్టానానికి, తన విజయం కోసం కష్టపడిన నాయకులు మరియు కార్యకర్తలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. రాబోయే రోజుల్లో మండలాన్ని అన్ని రంగాల్లో ముందంజలో ఉంచుతానని, ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేస్తానని హామీ ఇచ్చారు. మండల జడ్పిటిసి అభ్యర్థిగా కారాడ వెంకటమ్మ విజయం సాధించడం పట్ల మాజీ ఎంపీపీ ఉరిటి రామారావు, ఎంపీపీ అభ్యర్థి మరడాన నారాయణస్వామి, రాష్ట్ర టిడిపి నాయకులు మరడాన తవిటినాయుడు, తెలుగుదేశం పార్టీ నాయకులు అక్కేన మధుసూదనరావు,అంబటి తవిటినాయుడు(రాంబాబు) తదితరులు హర్షం వ్యక్తం చేశారు.మండల జడ్పిటిసి అభ్యర్థిగా గెలుపొందిన కారాడ వెంకటమ్మకు మండల రిటర్నింగ్ అధికారి ఎం వాణిశైలజ ధ్రువీకరణ పత్రమును అందజేశారు.ఈ కార్యక్రమంలో మండల ఉప ఎన్నికల అధికారులు నడిమింటి సూర్యనారాయణ, పాము బాల తదితరులు పాల్గొన్నారు.