కొత్తూరు జడ్పిటిసి గా టిడిపి అభ్యర్థి లోతుగెడ్డ శ్రీదేవి గెలుపు
కొత్తూరు, సూర్య : కొత్తూరు జడ్పిటిసి గా తెలుగుదేశం అభ్యర్థి లోతుగెడ్డ శ్రీదేవి తన సమీప వైసీపీ అభ్యర్థి చింతాడ యశోదమ్మ పై 7వేల ఓట్లు పైచిలుక తేడా తో విజయం సాధించారు.ఈమె భర్త మండల తెలుగుదేశం పార్టీ లో కీలక నేతగా వ్యవహారిస్తున్నారు.శ్రీదేవి భర్త లోతుగెడ్డ తులసీ వర ప్రసాదరావు రెండు సార్లు మండల పరిషత్ వైస్ ప్రసిడెంట్ గా పనిచేశారు.తనకు అత్యంత మెజార్టీ తో గెలిపించిన కొత్తూరు మండల ప్రజానీకానికి కృతజ్ఞతలు తెలియజేశారు.