తెలంగాణ రాష్ట్ర మరియు ఖేడ్ ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే సంజీవరెడ్డి
దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకొని నారాయణఖేడ్ శాసనసభ్యులు డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి తెలంగాణ రాష్ట్ర మరియు నారాయణఖేడ్ ప్రజలకు దీపావళి పండుగ సందర్భంగా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలిపారు చెడుపై మంచి సాధించిన విజయానికి చీకటిపై వెలుగు ప్రసరించిన విజయానికి ప్రతికంగ జరుపుకునే దీపావళి పండగ ప్రతి ఒక్కరి జీవితాల్లో సరికొత్త వెలుగులు నింపాలని ఆకాంక్షించారు. ప్రజలందరూ కుటుంబ సభ్యులతో కలిసి దీపావళి పండుగను ఆనందోత్వాహలతో సంతోషకరమైన వాతావరణంలో జరుపుకోవాలని వారు కోరారు పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ కాలుష్య రహిత దీపావళిని జరుపుకోవాలని టపాసులు కాల్చే సమయంలో తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించారు ఈ దీపావళి ప్రతి ఇంటా సిరి సంపదలు ఆయురారోగ్యాలు సుఖ సంతోషాలు నింపాలని ప్రజలందరికీ మంచి జరగాలని తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి పథంలో మరింత ముందుకు సాగాలని ఎమ్మెల్యే సంజీవరెడ్డి ఆకాంక్షించారు