ఆధార్ సెంటర్ కు వచ్చే ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి.. నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి
ఆధార్ కేంద్రానికి వచ్చే ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి సూచించారు..నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని ఎంఆర్ఓ కార్యాలయం సమీపంలో ఏర్పాటు చేసిన ప్రణమ్ వయోవృద్ధుల డే కేర్ సెంటర్ను శనివారం ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుళ్ల రాజేష్ రెడ్డి ఎమ్మార్వో కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన ఆధార్ కేంద్రాన్ని తనిఖీ చేశారు. ఆధార్ సేవలు ప్రజలకు ఏ విధంగా అందుతున్నాయో సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే స్వయంగా తన ఆధార్ కార్డును అప్‌డేట్ చేయించుకున్నారు. ఆధార్ వివరాల మార్పులు, అప్‌డేట్ కోసం వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సేవలు అందించాలని సిబ్బందికి సూచించారు. ఆధార్ ప్రతి పౌరుడికి ముఖ్యమైన గుర్తింపు పత్రమని, ప్రజలకు సులభంగా సేవలు అందుబాటులో ఉండేలా చూడాలని ఎమ్మెల్యే పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆధార్ కేంద్రం ఆపరేటర్ రాజు తో పాటు పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు…
పి. వినయ్ కుమార్, నాగర్‌కర్నూల్ క్రైమ్, సూర్య న్యూస్