ప్రజలందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలు : కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు
శ్రీకాకుళం, సూర్య : దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలుగు రాష్ట్రాల ప్రజలతో పాటు దేశ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. చీకటిపై వెలుగు, చెడుపై మంచి, అజ్ఞానంపై జ్ఞానం సాధించిన విజయానికి ప్రతీకగా నిలిచే దీపావళి ప్రతి ఒక్కరి జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని, సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, శాంతి సౌభాగ్యాలను అందించాలని ఆకాంక్షించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం అభివృద్ధి పథంలో పయనిస్తుండగా, ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ల నాయకత్వంలో కూటమి ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమ లక్ష్యాలతో ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. దేశ, రాష్ట్రాల ప్రగతితో పాటు ప్రజల జీవితాల్లోనూ వెలుగులు నిండాలని, ప్రతి కుటుంబం సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ప్రజలందరూ ఐక్యత, సోదరభావం, సామరస్యంతో పండుగను ఆనందంగా జరుపుకోవాలని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు పిలుపునిచ్చారు.