telangana
అవినీతి నిర్మూలనకు పారదర్శకతే కీలకం - జీఎం మునిగంటి శ్రీనివాస్
సూర్య నస్పూర్ : సింగరేణి సంస్థలో అవినీతి నిర్మూలనకు ప్రతి ఉద్యోగి బాధ్యతాయుతంగా వ్యవహరించాలని శ్రీరాంపూర్ ఏరియా జీఎం మునిగంటి శ్రీనివాస్ అన్నారు. విజిలెన్స్ అవగాహన వారోత్సవాల్లో భాగంగా శుక్రవారం సీసీసీలోని సింగరేణి గెస్ట్‌హౌస్‌లో శ్రీరాంపూర్, బెల్లంపల్లి, మందమర్రి ఏరియాల అధికారులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా సాఫ్ట్‌స్కిల్ ట్రైనర్ కిషోర్ ప్రభుత్వ రంగ సంస్థల్లో పారదర్శకత, అవినీతి నిర్మూలన చర్యలపై పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. లంచగొండితనం సంస్థల అభివృద్ధికి ఆటంకంగా మారుతుందని, పారదర్శక సేవలతో సంస్థకు మంచి పేరు వస్తుందని తెలిపారు. సింగరేణిలో విజిలెన్స్ విభాగం ద్వారా అవినీతిపై ఫిర్యాదులకు అవకాశం కల్పిస్తున్నట్లు జీఎం పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి రీజియన్ హెచ్‌ఓడీలు, ఉన్నతాధికారులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.