BREAKING
ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి.. ఉక్రెయిన్ భద్రతా సంస్థ ఎస్‌బీయూపై జెలెన్స్కీ తీవ్ర ఆగ్రహం సంప్రదాయ కుమ్మరి కళాకారులకు చేయూత తాగునీటిని వృథా చేస్తే కఠిన చర్యలు జలమండలి అధికారుల పిలుపు వెలిమెలలో తాగునీటి సమస్యకు పరిష్కారం నేషనల్ ఫుట్బాల్ గేమ్ సెలెక్ట్ అయిన గిరిజన విద్యార్థిని శైలజ ప్రజా సమస్యలపై ఎమ్మెల్సీ అంజిరెడ్డి క్షేత్రస్థాయి పర్యటన విద్యార్థుల తల్లిదండ్రుల ఆందోళన. అర్హులైన ఓటర్లకు ఎన్నికల సంఘం మరో అవకాశం.! కోహెడ నూతన డ్యూప్యూటీ తహసీల్దార్ రాకేష్ 25 రోజులుగా హిందీ క్లాసులు జరగలేదు…సర్పంచ్ కి విద్యార్థులు వినతి పత్రం… కెసిఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కావాలంటూ యువకుల పాదయాత్ర.… మహమ్మద్ షమీ ఎఫెక్ట్: మ్యాచ్ విన్నింగ్ స్పెల్స్.. ఓటముల్లోనూ హీరోగా.. లెక్కలకు అందని విదేశీ లెగసీ! కూరెళ్ల అంగన్వాడీ హెల్పర్(ఆయా) కమలమ్మ కుటుంబానికి పది లక్ష ఎక్స్ గ్రేషియాను ఇవ్వాలి ఎమ్మెల్యే అమర్ ను కలసిన చిత్తూరు మేయర్ కటారి హేమలత

చుట్టూ నీరు.. మధ్యలో అంగన్వాడీ భవనం: భయంలో పిల్లలు, తల్లిదండ్రులు!

Select Suryaa Now
చుట్టూ నీరు.. మధ్యలో అంగన్వాడీ భవనం: భయంలో పిల్లలు, తల్లిదండ్రులు!

​వంగర, సూర్య : వర్షాలు కురిస్తే చాలు వంగర మండలం మడ్డువలస అంగన్వాడీ కేంద్రం ఒక చెరువును తలపిస్తోంది. చుట్టూ మోకాళ్ల లోతు నీరు, మధ్యలో అంగన్వాడీ భవనం అంగన్వాడి కేంద్రం చుట్టూ వర్షపు నీరునిలిచిపోవడంతో చిన్నారుల  తల్లిదండ్రులు భయభ్రాంతులతోవణికిపోతున్నారు. ఏ క్షణంలో ఏం జరుగుతుందో అని భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు.
​ గతంలో కురిసిన వర్షాలకు సరైన డ్రైనేజీ వ్యవస్ధ లేకపోవడంతో వర్షపు నీరంతా అంగన్వాడీ కేంద్రం చుట్టూనే చేరింది. భవనం చుట్టూ నీరు నిల్వ ఉండటంతో చిన్న పిల్లలు అడుగు బయటపెట్టాలన్నా, అంగన్వాడీ కార్యకర్త ఆయా చిన్నారులను కంటికి రెప్పలా కాపాడుకొని వస్తున్నారని  చిన్నారుల తల్లితడ్రులుచేప్పుచూన్నారు. ఈ అంగన్వాడి కేంద్రం చుట్టూ నీరు చేరడంతో నిష సర్పాల నుండి భయానికి గురవుతున్నారు. వరుసపు నీరు నిల్వ ఉండటంతో విషసర్పాలు, దోమలు పెరిగిపోయి పిల్లల ఆరోగ్యానికి తీవ్ర ముప్పుగా మారింది 3 నుండి 6 ఏళ్ల వయస్సున్న చిన్నారులు నీటిలో పడిపోతారేమోనని తల్లిదండ్రులు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. అప్పటికి అంగన్వాడి కేంద్ర కార్యకర్త ఆయా చిన్నారులను కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారని. చిన్నారుల తల్లిదండ్రులు చెబుతున్నారు. అంగన్వాడి కేంద్రం కార్యకర్త ఆయా పిల్లలను ఎంతగా చూసుకున్నప్పటికీ ​ పిల్లలను పంపాలంటే చేతుల్లో ప్రాణాలు పెట్టుకోని చిన్నారులం కేంద్రానికి పంపించవలసి వస్తోంది. వర్షపు నీరు బయటకు వెళ్లే దారి లేక రోజుల తరబడి ఇక్కడే ఉండిపోతోంది. చిన్నారులకు ఏదైనా ప్రమాదం జరిగితే బాధ్యులు ఎవరు?" అని  తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ​ వెంటనే పంచాయతీ, ఐసీడీఎస్ (ICDS) అధికారులు స్పందించి: వర్షపు నీరు కేంద్రం చుట్టుపక్కల నిల్వ లేకుండా ఉండేటందుకు ​శాశ్వతంగా డ్రైనేజీ కాలువ నిర్మించి నీరు నిలవకుండా చర్యలు తీసుకోవాలని, ​అంగన్వాడీ పరిసరాల్లో బ్లీచింగ్ పౌడర్ చల్లి పారిశుధ్య చర్యలు చేపట్టాలని చిన్నారి తల్లిదండ్రులు ఊరుచూన్నారు. అధికారులు తక్షణమే చర్యలు తీసు కోవాలని అంగన్వాడి చిన్నారి తల్లిదండ్రులు కోరుతున్నారు.