దీక్షితార్ 191 వ దివ్యస్మరణ
విజయనగరం, సూర్య : రోటరీ దశిగి పేర్రాజు మ్యూజిక్ అకాడమీ ఉత్తరాది మఠం శాఖ కానుకుర్తి సత్రంలో ప్రారంభించి 1 సంవత్సరం అయ్యింది. అకాడమీ ప్రధాన కార్యాలయం కొత్తగ్రహారం లోనూ, ఉత్తరాది మఠం లోనూ సంగీత త్రిమూర్తులలో ఒకరైన ముత్తుస్వామి దీక్షితార్ 191 వ దివ్యస్మరణోత్సవం జరిగింది. ముఖ్య అతిథిగా అకాడమీ గౌరవాధ్యక్షులు రోటరీ దశిగి పేర్రాజు గారి కుమారులు, ప్రఖ్యాత చిన్నపిల్లల వైద్యులు డాక్టర్ శ్రీకాంత్, శ్రీమతి వల్లీ హాజరై దీక్షితార్ చిత్రపటానికి పూలమాలలు సమర్పించారు. ప్రిన్సిపాల్ డాక్టర్ మండపాక రవి దీక్షితార్ జీవిత విశేషాలు తెలియజేశారు. ఈ సందర్భంగా గాత్రం, వీణలపై విద్యార్థులు జానకి, శ్రావణి, పద్మకుమారి, కార్తికేయ, దుర్గా గౌరీ, మహాతీశ్వరి, శోభారాణి డాక్టర్ రమ్య, నిహారిక, డాక్టర్ హంసిత తదితరులు దీక్షితార్ కృతులు ఆలపించారు. భానుహర్ష వయొలిన్ పై, మహేశ్వర రావు, డాక్టర్ రవిశంకర్,శ్రీధామ అపరాజిత, అనన్య మృదంగం పై సహకారం అందించారు. విద్యార్థులు నిరంతర సంగీత సాధన ద్వారా వారు అనుకున్నది సాధించవచ్చు అని వారి తండ్రి గారి శతజయంతి పురస్కరించుకొని 2002 లో అకాడమీ ప్రారంభించి 2003 లో పద్మావతి నగర్ శాఖను, 2025లో ఉత్తరాది మఠం శాఖను ప్రారంభించామని డాక్టర్ శ్రీకాంత్ తెలియజేశారు. కార్యక్రమాన్ని గాత్ర, వీణ అధ్యాపకులు శారద పర్యవేక్షించారు. విద్యార్థులు, తల్లిదండ్రులు, అకాడమీ సిబ్బంది పాల్గొన్నారు.