telangana
ఏఆర్ఎస్ డిగ్రీ కళాశాలలో సైబర్ క్రైమ్ పై అవగాహన
సూర్య, జన్నారం : జన్నారం మండల కేంద్రంలో గల ఏఆర్ఎస్ డిగ్రీ కళాశాలలో శుక్రవారం స్థానిక ఎస్సై గుర్రం ఉదయ్ కిరణ్ విద్యార్థులకు సైబర్ క్రైమ్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఐ ఉదయ్ కిరణ్ మాట్లాడుతూ సైబర్ క్రైమ్ నేరాల పట్ల జాగ్రత్తగా ఉండాలని, ఆన్లైన్ మోసాలకు దూరంగా ఉండాలని, ఇందులో ఎలాంటి నిర్లక్ష్యం వహించిన ఇబ్బందులు పడవలసిన అవసరం ఏర్పడుతుందని అన్నారు. విద్యార్థులు చదువుపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. సోషల్ మీడియా, విద్యార్థుల భవిష్యత్తు, సైబర్ క్రైమ్ తదితర అంశాలపై విద్యార్థులకు ఉదయ్ కిరణ్ అర్థమయ్యే విధంగా వివరించారు. ఈ అవగాహన కార్యక్రమంలో ఏఆర్ఎస్ డిగ్రీ కళాశాల కరస్పాండెంట్ ముత్యం సతీష్, అధ్యాపకులు ప్రవళిక, శ్రావ్య, సరిత, జ్యోష్ణ, సత్తన్న, మోహన్, రవి, రాజు తదితరులు పాల్గొన్నారు.