ఎంపీటీసీ ఎన్నికల కౌంటింగ్ కి సర్వసిద్ధం
నెల్లిమర్ల, సూర్య : నెల్లిమర్ల నియోజకవర్గంలోని భోగాపురం, డెంకాడ, నెల్లిమర్ల, పూసపాటిరేగ మండలాలకు సంబంధించి ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్ శనివారం లెండి కళాశాలలో నిర్వహించడానికి అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. భోగాపురం మండలం ఓట్ల లెక్కింపు 4వ అంతస్తులోని జేసీ బోస్ హాల్ లో నిర్వహిస్తారు. డెంకాడ (షిరిడీ సాయి బ్లాక్) 4వ అంతస్తు సౌత్ వింగ్ లోనూ
నెల్లిమర్ల మండలం కళాశాలలోని షిరిడీ సాయి బ్లాక్ 1వ అంతస్తు CSE-LH-5 గదిలో నిర్వహిస్తారు. పూసపాటిరేగ లెండి కళాశాల అడ్మిన్ బ్లాక్ గ్రౌండ్ ఫ్లోర్ శ్రీనివాస రామానుజన్ కాన్ఫరెన్స్ హాల్ కౌంటింగ్ నిర్వహిస్తారు.కౌంటింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, శాంతిభద్రతల పరిరక్షణ కోసం జిల్లా పోలీసు యంత్రాంగం భారీ బందోబస్తును రంగంలోకి దించింది.
భద్రతా బలగాలు: 7 మంది డీఎస్పీలు, 37 మంది సీఐలు, 64 మంది ఎస్ఐలు, 104 మంది కానిస్టేబుళ్లు, 452 మంది ఇతర పోలీసు సిబ్బందిని నియమించారు. కౌంటింగ్ కేంద్రాల పరిధిలోని సంబంధిత పోలీసు స్టేషన్ల ద్వారా మూడంచెల భద్రతా చర్యలు చేపడుతున్నారు. అధికారులు మరియు సిబ్బంది సమన్వయంతో శనివారం ఉదయం నుంచే బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ప్రక్రియను సజావుగా పూర్తి చేసేందుకు అన్ని ఏర్పాట్లు సిద్ధమయ్యాయి.