వైసీపీకి 30వ వార్డు అభ్యర్థి దంపతుల రాజీనామా
బొబ్బిలి, సూర్య : వైఎస్ఆర్సీపీ పార్టీకి ప్రాథమిక సభ్యత్వానికి 30వ వార్డు నుంచి వైసీపీ తరఫున పోటీ చేసిన అభ్యర్థి శ్రీమతి సుంకరపల్లి వాసంతి మరియు ఆమె భర్త సుంకరపల్లి వెంగళరావు రాజీనామా చేసారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… వైసీపీలో వున్న కొంతమంది వ్యక్తులు, నమ్మించి వెన్నుపోటు పొడవడం వల్ల తాము నష్టపోయామని వారు ఆవేదన వ్యక్తం చేశారు.తమకు జరిగిన అన్యాయం వలన ఎంతో మానసిక వేదనకు గురయ్యామని, అందుకే పూర్తిగా రాజకీయాల నుంచి వైదొలుగుతున్నట్లు మీడియాకు తెలియజేశారు. ఇక నుంచి సామాన్య జీవితాన్ని గడపనున్నట్లు వారు స్పష్టం చేశారు.