BREAKING
పంజాబ్ కింగ్స్‌లోకి హార్దిక్ పాండ్యా: ముంబై ఇండియన్స్‌కు అర్ష్‌దీప్ సింగ్.. ఐపీఎల్ ట్రేడ్‌లో బిగ్ అప్‌డేట్! రామాయణం'లో సీత పాత్రను సాయి పల్లవి తప్ప ఇంకెవరూ చేయలేరు: ధనుష్ సంచలన వ్యాఖ్యలు నగరం జడ్పిటిసి అభ్యర్థి చింతల సుబ్బారావు 15,694 ఓట్ల మెజార్టీతో గెలుపు రామాయణం'లో చిన్న పాత్ర అయినా నటించడం నాకెంతో గర్వకారణం: కాజల్ అగర్వాల్ భావోద్వేగ వ్యాఖ్యలు పైర్ సినిమాకు ఎదురుదెబ్బ: థియేటర్లలో 75 శాతం షోలను తగ్గించారన్న దర్శకుడు వినోద్ కాప్రీ స్ట్రేంజర్ థింగ్స్ ఫ్యాన్స్‌కు అంచనాలు పెంచే అప్‌డేట్: 1955 కాలం నాటి కథతో 'అదర్ వరల్డ్స్' ప్రీక్వెల్ ప్రకటన త్రికోటేశ్వర క్రాకర్స్ లో అధిక రేట్లు - ప్రజల నుంచి ఫిర్యాదులు, స్పందించాలని డిమాండ్ పిడుగురాళ్ల రూరల్ మేజర్ న్యూస్ పిడుగురాళ్ల రూరల్ పరిధిలోని త్రికోటేశ్వర క్రాకర్స్ షాపులో బాణాసంచా అధిక రేట్లకు విక్రయిస్తున్నారని ప్రజలు, వినియోగదారులు ఆరోపిస్తున్నారు. పండుగ సీజన్ ను ఆసరాగా చేసుకుని ఎంఆర్పీ కంటే బాక్సాఫీస్ వద్ద రామాయణం సరికొత్త రికార్డులు: శనివారం నాటికి రూ.167 కోట్లు దాటిన వసూళ్లు చిట్టమూరు జడ్పీటీసీగా పెళ్లూరు సౌజన్య రెడ్డి ఘన విజయం! 1,820 ఓట్ల భారీ మెజారిటీతో విజయకేతనం ఓమ్: చాప్టర్ 1 - ఉదిరం' మల్టీ-హీరో సినిమా: కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ ఆసక్తికర వ్యాఖ్యలు ఇండస్ట్రీ మనల్ని ఎప్పుడూ అభద్రతాభావానికి గురిచేస్తుంది: ప్రముఖ దర్శకురాలు ఫరా ఖాన్ సంచలన వ్యాఖ్యలు నగరం మండలంలో 14 ఎంపీటీసీ స్థానాలు టీడీపీ కైవసం ప్రతి విద్యార్థి తప్పక చూడాల్సిన చిత్రం 'జయంత్ అండ్ ది జింగో పెన్': ఎమ్మెల్సీ మల్క కొమరయ్య ప్రశంసలు మంచి సినిమాను థియేటర్లలోనే ఆదరించాలి: 'సమ్మర్ హాలిడేస్' థ్యాంక్స్ మీట్‌లో నిర్మాత ధీరజ్ మొగిలినేని భావోద్వేగ వ్యాఖ్యలు ఇంకొల్లు జడ్పీటీసీగా పూజల శ్రీనివాసరావు

రాష్ట్రస్థాయి క్రికెట్ పోటీలకు హేమశ్రీ ఎంపిక

Select Suryaa Now
రాష్ట్రస్థాయి క్రికెట్ పోటీలకు హేమశ్రీ ఎంపిక

భోగాపురం, సూర్య : స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించే అండర్‌-17 రాష్ట్రస్థాయి క్రికెట్ పోటీలకు భోగాపురం మండలం జగ్గయ్యపేట గ్రామానికి చెందిన కొల్లి హేమశ్రీ ఎంపికైంది. శ్రీ సాయి నారాయణ హైస్కూల్‌లో విద్యనభ్యసిస్తున్న హేమశ్రీ జిల్లా జట్టు తరఫున రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రాతినిధ్యం వహించనుంది. జిల్లా నుంచి ఎంపికైన 15 మంది సభ్యుల జట్టులో ఆమెకు చోటు దక్కడం విశేషం. ఈ నెల 8వ తేదీ నుంచి కృష్ణా జిల్లాలో రాష్ట్రస్థాయి పోటీలు జరగనున్నాయి. చదువుతోపాటు క్రీడల్లోనూ ప్రతిభ కనబరుస్తూ రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక కావడం పట్ల హేమశ్రీని పాఠశాల యాజమాన్యం అభినందించింది. క్రీడల పట్ల ఆసక్తి, నిరంతర సాధన, క్రమశిక్షణతో ఈ స్థాయికి చేరుకోవడం అభినందనీయమని పేర్కొంది. విద్యార్థినిలోని క్రీడా నైపుణ్యాన్ని గుర్తించి, తగిన శిక్షణ అందించిన పాఠశాల పీఈటీ శివప్రసాద్‌ను ప్రత్యేకంగా ప్రశంసించింది. ఈ సందర్భంగా పాఠశాల డైరెక్టర్ పి. సుధీర్, ప్రిన్సిపాల్ పి. అరుణ మాట్లాడుతూ.. హేమశ్రీ రాష్ట్రస్థాయి పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచి పాఠశాలకు, గ్రామానికి, జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. విద్యార్థుల ప్రతిభను ప్రోత్సహిస్తూ క్రీడల్లో రాణించేలా తీర్చిదిద్దడమే పాఠశాల లక్ష్యమని తెలిపారు. హేమశ్రీ మరిన్ని విజయాలు సాధించాలని వారు ఆకాంక్షించారు.