స్థానిక పోరులో అభ్యర్థుల భవితవ్యం తేలేది నేడే
పూసపాటిరేగ, సూర్య : పూసపాటిరేగ స్థానిక సంస్థల జడ్పిటిసి తోపాటు 21 స్థానాలకు జరుగునున్న ఎంపీటీసీల అభ్యర్థుల భవితవ్యం శనివారం కొన్ని గంటల్లోనే తేలిపోనుంది. జడ్పిటిసి స్థానానికి గాను కూటమి అభ్యర్థి తరపున కోట్ల రేవతి, వైకాపా తరపున మహంతి శివ పోటీ చేయగా, తెదేపాకు చెందిన పసుపులేటి గోపికి జడ్పిటిసి స్థానం దక్కకపోవడంతో తన సతీమణి అయిన పసుపులేటి లలిత కళ తెదేపా తిరుగుబాటు అభ్యర్థిగా పోటీ చేశారు. అయితే కూటమి అభ్యర్థిని కోట్ల రేవతి తరఫున తన భర్త జనసేన నాయకుడు కోట్ల రఘు విస్తృత ప్రచారం చేయగా, వైకాపా నుంచి తెదేపా తీర్థం పుచ్చుకున్న మాజీ ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు కూడా చివరలో రేవతి తరపున ప్రచార నిర్వహిస్తూ గెలుపు కోసం తనదైన శైలిలో కృషి చేశారు. మరోవైపు జడ్పిటిసి స్థానానికి వైకాపా తరుపున నామినేషన్ వేసి భంగపడ్డ రాష్ట్ర శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ సోదరుడు లక్ష్మణరావు తనయుడు చైతన్య డమ్మీగా వేసిన మహంతి శివ తరుపున లక్ష్మణరావు తో పాటు చైతన్య కూడా విస్తృత ప్రచారాన్ని నిర్వహించారు. దీనిపై ఇరువురు మధ్య పోటీ బలంగానే సాగినప్పటికీ, మధ్యలో తెదేపా తిరుగుబాటు అభ్యర్థి పసుపులేటి లలిత కళ పోటీ చేయడం వలన హాయ్ మీ ఓట్లు చీలుక వలన కూటమి అభ్యర్థితో పాటు వైకాపా అభ్యర్థిపై కూడా ఎవరికి వారే గెలుపు గుర్రాలపై ఆశలు పెట్టుకుంటున్నారు. ఇక ఎంపీటీసీ అభ్యర్థులకు జరిగిన ఎన్నికల్లో కూటమి తరుపున సఖ్యత లేకపోవడంతో పలువురు ఇరు పార్టీలకు చెందిన అభ్యర్థులు తిరుగుబాటు అభ్యర్థులుగా పోటీ చేయడంతో వైకాపా అభ్యర్థులు సాధిస్తారని ధీమా వ్యక్తం చేస్తుండగా, తెదేపా ఆవిర్భావం నుంచి పార్టీ బలంగా ఉండడంతో కూటమి తరపున తెదేపాయే వీడియో సాధించి అధ్యక్ష పీఠాన్ని కైవసం చేసుకుంటుందని ఆ పార్టీ నాయకులు భీమాను వ్యక్తం చేస్తున్నారు. అయితే కూటమిలో రెల్లివలస2, వెంపడం ఎంపీటీసీ స్థానాలు గాను జనసేన తో పాటు తెదేపాకు కూడా బీఫారాలు ఇవ్వడంతో ఓటర్లకు తలనొప్పిగా మారింది. కూ టమి నాయకుల కుమ్ములాట వలన బిజీయా ఎవరిని వరిస్తుందనేది చెప్పలేని పరిస్థితి ఏర్పడింది. అదేవిధంగా గతంలో ఎంపీపీగా ఉన్న మహంతి కళ్యాణి పసుపం ఎంపీటీసీ సభ్యురాలుగా సాధించగా, తాజాగా తన తండ్రి అయిన వైకాపా మండల అధ్యక్షుడు పతివాడ అప్పలనాయుడు పోటీ చేశారు. అయితే ఇక్కడ స్థానం అన్ రిజర్వుడ్ కావడంతో అప్పలనాయుడు పై వైకాపా తిరుగుబాటు అభ్యర్థిగా తెలగా సామాజిక వర్గానికి చెందిన పైడి పోటీ చేశారు. కూటమి ఉమ్మడి అభ్యర్థిగా దువ్వ అప్పల స్వామి కూడా తలపడడంతో త్రిముఖ పోటీలో ఎవరు విద్యార్థులుగా నిలుస్తారని అన్నది ప్రశ్నార్ధకంగా మారింది. కంది వలస స్థానానికి కూడా వైకాపా తో పాటు కూటమి ఉమ్మడి అభ్యర్థిగా జనసేన మండల కన్వీనర్ జలపారి శివ సతీమణి లక్ష్మీపార్వతి పోటీ చేయగా, టికెట్ కోసం ఆశించి భంగపడ్డ కూని శెట్టి గోవింద తిరుగుబాటు అభ్యర్థిగా తన సతీమణి అయిన రాజేశ్వరిని రంగంలోకి దింపి పోటీ చేయడంతో త్రీ మొక్క పోటీలో గెలుపు ఎవరు అన్నది ప్రశ్నార్ధకంగా మారింది. ఏది ఏమైనప్పటికీ కూటమి కుమ్ములాట వలన వైకాపాకు ఎంపీపీ పీఠం దక్కుతుందా, లేక స్వతంత్ర అభ్యర్థుల విజయం సాధిస్తే వారి సహకారంతో కూటమి అధ్యక్ష పీఠాన్ని కైవసం చేసుకుంటున్నాదా అన్నది కొన్ని గంటల వ్యవధిలో అభ్యర్థుల తలరాతలను మార్చే తేలిపోనుంది.