BREAKING
ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో ట్రాఫిక్ ఆంక్షలు గొంతు ఎండుతుంది - త్రాగు నీరు ఇవ్వండి! గజపతినగరంలో రోగులు బాధలు సమర్థవంతంగా విధులు నిర్వహించిన పోలీస్ అధికారులు, సిబ్బందిని అభినందించిన జిల్లా ఎస్పీ బి. ఉమామహేశ్వర్ కురువ భాస్కర్ పరామర్శించిన జిల్లా అధ్యక్షులు అనంత, మేయర్ రమేష్ గౌడ్ టీడీపీకి రాజీనామా చేసి వైఎస్సార్‌సీపీలో చేరిన కృష్ణాపురం గ్రామ దంపతులు రాష్ట్రస్థాయి క్రికెట్ పోటీలకు హేమశ్రీ ఎంపిక వైసీపీకి 30వ వార్డు అభ్యర్థి దంపతుల రాజీనామా అనుమతులు లేకుండా టపాసులు విక్రయిస్తే కఠిన చర్యలు: ఎస్పీ పంకజ్ కుమార్ మీనా స్థానిక పోరులో అభ్యర్థుల భవితవ్యం తేలేది నేడే స్థానిక సమరానికి ఫలితాల వేళ! విద్యార్థులకు ఉపన్యాస పోటీలు ఎంపీటీసీ ఎన్నికల కౌంటింగ్ కి సర్వసిద్ధం ఉద్యాన రైతులకు రూ.11.79 కోట్ల నష్టపరిహారం వెంటనే విడుదల చేయాలి * సీఎం చంద్రబాబుకు ఎమ్మెల్యే నక్కా ఆనంద్ బాబు వినతి కల్వకోల్‌లో బీఆర్ఎస్ నేతల అసంతృప్తి సెగలు*

వ్యక్తి జీవితాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దే శక్తివంతమైన సాధనం విద్యా - ప్రిన్సిపాల్

Select Suryaa Now
వ్యక్తి జీవితాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దే శక్తివంతమైన సాధనం విద్యా - ప్రిన్సిపాల్
సూర్య, మందమర్రి : విద్య అనేది వ్యక్తి జీవితాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దే శక్తివంతమైన సాధనమని వివేకవర్ధిని డిగ్రీ అండ్ పీజీ కళాశాల కరస్పాండెంట్ డా. చంద్రమోహన్ గౌడ్ ఉదారి అన్నారు. మందమర్రి మండలం అందుగులపేటలోని శ్రీ కన్వెన్షన్‌ హాల్ లో శుక్రవారం వివేకవర్ధిని డిగ్రీ అండ్ పీజీ కళాశాల మంచిర్యాల ఆధ్వర్యంలో ఫ్రెషర్స్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాకతీయ విశ్వవిద్యాలయం 2021–2023 విద్యా సంవత్సరంలో గోల్డ్ మెడల్ సాధించిన కళాశాల విద్యార్థిని నుజాత్ అంజుమ్‌ను కళాశాల యాజమాన్యం, ప్రిన్సిపాల్, కరస్పాండెంట్, అధ్యాపక బృందం ఘనంగా సన్మానించి అభినందించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ ఆర్. శ్రీనివాస్ మాట్లాడుతూ విద్యార్థులు జీవితంలో స్పష్టమైన లక్ష్యాలను నిర్దేశించుకుని క్రమశిక్షణ, సమయపాలన, పట్టుదలతో నిరంతరం కృషి చేయాలని సూచించారు. కలలు కనడమే కాకుండా వాటిని సాకారం చేసుకునే వరకు శ్రమించాలని, నిరంతర సాధనతో ప్రతి విద్యార్థి ఉన్నత విజయాలు సాధించవచ్చని పేర్కొన్నారు. నుజాత్ అంజుమ్ సాధించిన గోల్డ్ మెడల్ కళాశాలకు గర్వకారణమని, తోటి విద్యార్థులకు స్ఫూర్తిదాయకమని కొనియాడారు. ఈ సందర్భంగా కళాశాల కరస్పాండెంట్ డా. చంద్రమోహన్ గౌడ్ ఉదారి మాట్లాడుతూ విద్యార్థులు ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగాలని, విద్యార్థులు కేవలం పట్టాలు పొందడానికే పరిమితం కాకుండా ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని జీవితంలో స్థిరపడే దిశగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఒక విద్యార్థి సాధించిన విజయం ఆ విద్యార్థికే కాకుండా తల్లిదండ్రులు, కళాశాల, సమాజానికి గర్వకారణమని పేర్కొన్నారు. వివేకవర్ధిని కళాశాల నాణ్యమైన విద్యను అందిస్తూ విద్యార్థుల భవిష్యత్తుకు బలమైన పునాదులు వేస్తోందని తెలిపారు. ఇక్కడ విద్యనభ్యసించిన పలువురు పూర్వ విద్యార్థులు పోలీస్, రెవెన్యూ తదితర ప్రభుత్వ ఉద్యోగాల్లో స్థిరపడగా, మరికొందరు విదేశాల్లో ఉన్నత అవకాశాలను అందిపుచ్చుకుంటున్నారని హర్షం వ్యక్తం చేశారు. అధ్యాపకులు విద్యార్థులను సొంత బిడ్డల్లా భావిస్తూ అంకితభావంతో విద్యాబోధన చేయడం కళాశాల ప్రత్యేకతగా పేర్కొన్నారు. విద్యార్థులు అపజయాలకు భయపడకుండా వాటిని విజయానికి మెట్లుగా మలుచుకోవాలని, ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణతో ముందుకు సాగాలని సూచించారు. విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసి, ఉన్నత విద్యతో పాటు ఉద్యోగ అవకాశాల్లో రాణించేలా కళాశాల నిరంతరం ప్రోత్సహిస్తోందని ఈ సందర్భంగా వెల్లడించారు. ఈ సందర్భంగా గోల్డ్ మెడల్ సాధించిన నుజాత్ అంజుమ్‌కు శుభాకాంక్షలు తెలియజేస్తూ భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు షరీనా, బి. రమేష్, శ్రీలేఖ, వైష్ణవి, పవిత్ర, శ్రీనివాస్, తిరుపతి, సతీష్, సమీర్, రమేష్, మమత, మౌనిక తదితరులు పాల్గొన్నారు.