telangana
సర్ సివి రామన్ జయంతి సందర్భంగా విద్యార్థులకు పోటీలు
సూర్య రెంజల్ : సర్ సి.వి.రామన్ జయంతి వారోత్సవాలు సందర్భంగా రెంజల్ మండలంలోని విద్యార్థులకు మండల స్థాయి పోటీలను రిటైర్డ్ హెచ్ఎం విజయ్ ఆనంద్ ఆధ్వర్యంలో నిర్వహించారు. శుక్రవారం మండల కేంద్రంలోని పీఎం శ్రీ ప్రభుత్వ మత పాఠశాలలో ఎంఈఓ ఆంజనేయులు ఆధ్వర్యంలో మండలం స్థాయి క్రీడా పోటీలనులో ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులు క్విజ్, రంగోలి, వ్యాసరచన ఇతర పోటీలను విద్యార్థులకు నిర్వహించారు. సర్ సివి రామన్ జయంతి వారోత్సవాల్లో భాగంగా, విద్యార్థులకు ఆయన యొక్క ప్రాముఖ్యత పై టాలెంట్ టెస్టులను కూడా ఏర్పాటు చేశారు. ఈ క్రీడా పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో పిఆర్టియు మండల అధ్యక్షుడు సోమలింగం గౌడ్,ఉపాధ్యాయులు కిషోర్ నాందేవ్ శేఖర్ గంగాధర్ శంకర్ సుధాకర్ అరుణ్ సంజీవన్ శ్రీనివాస్ విద్యార్థినిలు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.