telangana
మహిళా సమైక్య భవనానికి భూమి పూజ చేసిన రావుల లావణ్య శ్రీనివాస్
సూర్య ముధోల్ : నిర్మల్ జిల్లా ముధోల్ మండలంలోని ఆష్ట గ్రామంలో మహిళా సమైక్య భవనానికి భూమి పూజ చేసిన గ్రామ సర్పంచ్ రావుల లావణ్య శ్రీనివాస్ గ్రామ పంచాయతీ పరిధిలోని నూతన భవన నిర్మాణానికి అంగన్వాడి భవనం పక్కన భూమి పూజ చేశారు.ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ రావుల లావణ్య శ్రీనివాస్ మాట్లాడుతూ, మహిళా సర్పంచ్, మహిళా ఉప సర్పంచ్ ఆధ్వర్యంలో మహిళలకు మహిళా సమైక్య భవనానికి భూమి పూజ చేయడం సంతోషాన్నిచ్చిందని వారు తెలిపారు అంతేకాకుండా మహిళా సమైక్య భవనానికి పైకి వెళ్లడానికి మెట్ల తో పాటు మెయింటినెన్స్ చేసుకోవడానికి మెట్లు ఉపయోగపరంగా ఉంటాయని అంతేకాకుండా మెట్ల కింద ఒక మహిళా సోదర మహిళా సర్పంచ్ మహిళల గురించి ఆలోచించి వాష్ రూమ్లు నిర్మిస్తామని రెండు నెలల్లో భవనం మహిళలకు అందజేస్తామని నాణ్యత విషయంలో రాజీ పడకుండా నాణ్యత లోపం లేకుండా నిర్మాణం చేస్తామని వారు తెలిపారు.భూమి పూజ చేసి మట్టితో పనులు ప్రారంభించారు ఈ కార్యక్రమంలో గ్రామ మహిళ ఉపసర్పంచ్ సావిత్ర కోటయ్య మహిళా సంఘ అధ్యక్షులు జైశిల్, ఉపాధ్యక్షులు దేవ్ భాయ్, కోశాధికారి లోలం కవిత, గ్రామంలో అన్ని గ్రామ సంఘాల మహిళా సభ్యులు విడిసి అధ్యక్షులు మీరు,అజయ్ రెడ్డి,వార్డ్ మెంబర్స్ మిద్దె ప్రమీల, సురేష్, బొంగు సంతోష్ చిన్నన్న జ్యోతి తదితరులు పాల్గొన్నారు.