BREAKING
ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో ట్రాఫిక్ ఆంక్షలు గొంతు ఎండుతుంది - త్రాగు నీరు ఇవ్వండి! గజపతినగరంలో రోగులు బాధలు సమర్థవంతంగా విధులు నిర్వహించిన పోలీస్ అధికారులు, సిబ్బందిని అభినందించిన జిల్లా ఎస్పీ బి. ఉమామహేశ్వర్ కురువ భాస్కర్ పరామర్శించిన జిల్లా అధ్యక్షులు అనంత, మేయర్ రమేష్ గౌడ్ టీడీపీకి రాజీనామా చేసి వైఎస్సార్‌సీపీలో చేరిన కృష్ణాపురం గ్రామ దంపతులు రాష్ట్రస్థాయి క్రికెట్ పోటీలకు హేమశ్రీ ఎంపిక వైసీపీకి 30వ వార్డు అభ్యర్థి దంపతుల రాజీనామా అనుమతులు లేకుండా టపాసులు విక్రయిస్తే కఠిన చర్యలు: ఎస్పీ పంకజ్ కుమార్ మీనా స్థానిక పోరులో అభ్యర్థుల భవితవ్యం తేలేది నేడే స్థానిక సమరానికి ఫలితాల వేళ! విద్యార్థులకు ఉపన్యాస పోటీలు ఎంపీటీసీ ఎన్నికల కౌంటింగ్ కి సర్వసిద్ధం ఉద్యాన రైతులకు రూ.11.79 కోట్ల నష్టపరిహారం వెంటనే విడుదల చేయాలి * సీఎం చంద్రబాబుకు ఎమ్మెల్యే నక్కా ఆనంద్ బాబు వినతి కల్వకోల్‌లో బీఆర్ఎస్ నేతల అసంతృప్తి సెగలు*

ఎల్-నినో పరిస్థితులపై అప్రమత్తంగా ఉండాలి.

Select Suryaa Now
ఎల్-నినో పరిస్థితులపై అప్రమత్తంగా ఉండాలి.

సంగారెడ్డి, ;  ఎల్-నినో పరిస్థితులు, రాబోయే వేసవిని దృష్టిలో ఉంచుకుని జిల్లాలో ఎక్కడా తాగునీటి కొరత తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని అదనపు  కలెక్టర్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో భూగర్భ జలాలు , నీటి వనరుల నిర్వహణ, పర్యవేక్షణ, తాగునీటి సరఫరాపై జిల్లా స్థాయి కమిటీ సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా  అదనపు కలెక్టర్  మాట్లాడుతూ, ఎల్-నినో ప్రభావంతో వర్షపాతం లోటు ఏర్పడే అవకాశాలు ఉన్నందున రాబోయే వేసవిలో తాగునీటి సమస్యలు తలెత్తకుండా ఇప్పటి నుంచే సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకోవాలని సూచించారు. తాగునీటి సరఫరాకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని, అందుబాటులో ఉన్న భూగర్భ, ఉపరితల నీటి వనరులను పొదుపుగా, సమర్థవంతంగా వినియోగించుకోవాలని తెలిపారు. ఈ నెల  15 నుంచి డిసెంబర్ 31 వరకు జిల్లావ్యాప్తంగా తాగునీటి సరఫరా మౌలిక సదుపాయాలపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని సూచించారు. ఇందులో భాగంగా గ్రామాలల్లోని తాగునీటి సరఫరా వ్యవస్థలు, పైపులైన్లు, నీటి వనరులు, పంపులు, మోటార్ల పనితీరును క్షేత్రస్థాయిలో పరిశీలించాలి. లీకేజీలు, మరమ్మతులు అవసరమైన ప్రాంతాలు, సరఫరాలో ఉన్న లోపాలను గుర్తించి వెంటనే పరిష్కరించాలని  అధికారులను  ఆదేశించారు. ప్రత్యేక డ్రైవ్ నిర్వహణకు మండల స్థాయిలో ఇంట్రా విభాగం ఏఈఈలు, గ్రిడ్ విభాగం ఏఈఈలు, ఎంపీఓలు, సంబంధిత గ్రామాల సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులతో బృందాలను ఏర్పాటు చేయాలని తెలిపారు. ప్రతి మండలంలోని అన్ని గ్రామాల్లో రోజువారీ తనిఖీలకు షెడ్యూల్ రూపొందించి,  క్షేత్ర స్థాయిలో  తనిఖీల  నిర్వహించి  నివేదికలు సమర్పించాలని సూచించారు.  వర్షపు నీటిని వృథా కాకుండా ఒడిసిపట్టి భూగర్భ జలాలను పెంపొందించేందుకు జిల్లాలో విస్తృత చర్యలు చేపట్టాలి.  ప్రతి ఇంటి వద్ద ఇంకుడు గుంతల నిర్మాణాన్ని ప్రోత్సహించాలి. బోరుబావుల వద్ద సోక్‌పిట్లు ఏర్పాటు చేయడంతో పాటు, బోరుబావుల రీఛార్జ్ నిర్మాణాలు చేపట్టాలి.  ఇళ్లపై పడే వర్షపు నీటిని ఇంకుడు గుంతల ద్వారా భూమిలోకి ఇంకేలా చర్యలు తీసుకోవాలి. బోరుబావుల పరిసరాల్లో వర్షపు నీరు భూమిలోకి ఇంకేలా ప్రత్యేక ఏర్పాట్లు చేయాలి. తద్వారా భూగర్భ జలమట్టం పెరిగి భవిష్యత్తులో తాగునీటి కొరతను నివారించేందుకు వీలవుతుందని  ఆయన  స్పష్టం చేశారు .  గ్రామాల్లో చేతిపంపులు, సింగిల్ ఫేజ్, త్రీ ఫేజ్ మోటార్లకు మరమ్మతులు చేపట్టి వినియోగానికి సిద్ధంగా ఉంచాలి. పైపులైన్లు, వాల్వ్‌ల లీకేజీలను అరికట్టాలి. ఓహెచ్ఎస్ఆర్, జీఎల్ఎస్ఆర్ ట్యాంకులు, సంపులను నిర్ణీత సమయంలో శుభ్రం చేయాలి. తాగునీటిలో క్లోరినేషన్ సక్రమంగా జరిగేలా చూడాలని, బ్లీచింగ్ పౌడర్ నిల్వలు అందుబాటులో ఉంచాలని సూచించారు. అవసరమైన ప్రాంతాల్లో వినియోగించేందుకు నీటి ట్యాంకర్లను సిద్ధంగా ఉంచాలని   తెలిపారు. నీటి కొరతకు అవకాశం ఉన్న గ్రామాలను ముందుగానే గుర్తించి ప్రత్యామ్నాయ నీటి వనరులను పరిశీలించాలి. స్థానిక భూగర్భ జల వనరుల లభ్యత, నీటి నాణ్యత, నిల్వ సామర్థ్యాన్ని అంచనా వేయాలి. అవసరమైన చోట అనుమతులతో ప్రత్యామ్నాయ నీటి సరఫరా ఏర్పాట్లు చేయాలి. విద్యుత్ శాఖ, నీటిపారుదల శాఖ, పంచాయతీరాజ్, మిషన్ భగీరథ గ్రిడ్, మిషన్ భగీరథ ఇంట్రా, ఇంజినీరింగ్ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని తెలిపారు. నీటి వనరుల లభ్యత, విద్యుత్ సరఫరా, మరమ్మతులు, ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై ఎప్పటికప్పుడు సమీక్షించాలన్నారు.  అలాగే వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు తక్కువ నీటిని వినియోగించే పంటల సాగుపై అవగాహన కల్పించాలని, ముఖ్యంగా వరి సాగును తగ్గించి ప్రత్యామ్నాయ పంటల వైపు ప్రోత్సహించాలని సూచించారు. ప్రత్యేక డ్రైవ్‌లో చేపట్టిన పనులపై మండల స్థాయిలో సమీక్షలు నిర్వహించి, ప్రతి వారం సమగ్ర నివేదికలు సమర్పించాలని అధికారులను ఆదేశించారు. ఎల్-నినో పరిస్థితులు ముగిసే వరకు  తాగునీటి సరఫరా పరిస్థితిని పర్యవేక్షించాలని  అదనపు కలెక్టర్ తెలిపారు. ఈ సమావేశంలో  జడ్పీసీఈఓ  జానకి రెడ్డి ,  నీటిపారుదల శాఖ ఈ ఈ జై భీం ,  భూగర్భ జలాల అభివృద్ధి శాఖ డి డి మోహన్ , ఆర్ డెబ్ల్యూ ఎస్, ఎస్ ఈ  పాషా , విద్యుత్  శాఖ అధికారులు  ,మిషన్ భగీరథ్ గ్రిడ్ ఈ ఈ  విజయలక్ష్మి ,  సంబంధిత శాఖల జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.