కళ్యాణదుర్గం లో మూడు కేంద్రాల్లో ఓట్ల లేకుంపు.
కళ్యాణదుర్గ మేజర న్యూస :-
ఎంపీటీసీ, జడ్పిటి సి ఎన్నికలకు సంబంధించి ఓట్ల లెక్కింపు ప్రక్రియను కళ్యాణదుర్గం పట్టణంలోని మూడు కేంద్రాల్లో నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఏడు మండలాలకు చెందిన జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపు కోసం ఆయా కేంద్రాల్లో ప్రత్యేక గదులను కేటాయించారు. మండలాల వారీగా కౌంటింగ్ ప్రక్రియ సజావుగా సాగేందుకు గదుల కేటాయింపులో అధికారులు స్పష్టమైన ప్రణాళిక రూపొందించారు. ఇందులో భాగంగా కరణం చిక్కప్ప హైస్కూల్‌ను ప్రధాన లెక్కింపు కేంద్రంగా ఏర్పాటు చేశారు. ఈ కేంద్రంలో నాలుగు మండలాలకు సంబంధించిన ఓట్లను లెక్కించనున్నారు. కంబదూరు మండలానికి 41, 42 గదులు, శెట్టూరు మండలానికి 45, 46 గదులు, గుమ్మగట్ట మండలానికి 43, 44 గదులు, కుందుర్పి మండలానికి 32, 34 గదులను కేటాయించారు. అదేవిధంగా కళ్యాణదుర్గం పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కళ్యాణదుర్గం మండలానికి సంబంధించిన ఓట్ల లెక్కింపు నిర్వహించనున్నారు. ఇందుకోసం ఆరో, ఏడో గదులను కేటాయించారు. ప్రభుత్వ కళాశాలలో బెలుగుప్ప, బ్రహ్మసముద్రం మండలాలకు చెందిన ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. బెలుగుప్ప మండలానికి రెండో, ఐదో గదులు, బ్రహ్మసముద్రం మండలానికి 13వ గది, మొదటి అంతస్తులోని 12వ గదిని కేటాయించారు. ఈ విధంగా మొత్తం మూడు కేంద్రాల్లో ఏడు మండలాలకు చెందిన ఓట్ల లెక్కింపు చేపట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆయా మండలాల అభ్యర్థులు, రాజకీయ పార్టీల ప్రతినిధులు, కౌంటింగ్ ఏజెంట్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన సదుపాయాలు కల్పించడంపై అధికారులు దృష్టి సారించారు. ఓట్ల లెక్కింపు సమయంలో పారదర్శకత, క్రమశిక్షణ, భద్రతకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ప్రతి కేంద్రం వద్ద పోలీసు బందోబస్తు, ప్రవేశ నియంత్రణ, ఇతర భద్రతా చర్యలు చేపట్టనున్నారు. ఎన్నికల ఫలితాల వెల్లడికి సంబంధించి అధికార యంత్రాంగం సమన్వయంతో పనిచేసేలా చర్యలు తీసుకుంటోంది. మూడు కేంద్రాల్లో కౌంటింగ్ ఏర్పాట్లు పూర్తిచేసి, నిర్ణీత నిబంధనల ప్రకారం లెక్కింపు ప్రక్రియ నిర్వహించేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు.
కళ్యాణదుర్గం టౌన్ రిపోర్టర్ :- బోయ రంగస్వామి.