BREAKING
కల్యాపూర్ లో కమ్యూనిటీ ఇంకుడు గుంతల నిర్మాణం స్పెయిన్ రైల్వే శాఖలో యూఈ అక్రమాల విచారణ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు నేత్ర పరీక్షలు 25వ రోజు అదే జోరు - జాతి ఆరోగ్య మిషన్ కాంట్రాక్టు ఉద్యోగస్తుల సమ్మె బ్రిటన్ గృహ నిర్మాణ రంగంలో సంక్షోభం రామేశ్వర్ పల్లిలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలకు భూమి పూజ సిలువ గుట్ట అక్రమ తవ్వకాలపై సీపీఐ ఆగ్రహం అనుమతులు లేని టపాకాయల  దుకాణాలపై కన్నెత్తి చూడని సంబంధిత అధికారులు అమెరికా మధ్యంతర ఎన్నికల తర్వాత గ్లోబల్ మార్కెట్లలో తీవ్ర ప్రకంపనలు గ్రామాలలో అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి - మండల ప్రత్యేక అధికారి రెడ్ క్రాస్ తలసేమియా సెంటర్‌కు లక్షన్నర ఆర్థిక సాయం అందజేసిన టిడిపి నాయకులు బస్వాపూర్ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు షూల పంపిణీ బ్రిటన్ టెలికాం రంగంలో తీవ్ర సంక్షోభం చిన్నారి ప్రాణం తీసిన ఎలక్ట్రిక్ కాంటా ఎండ్రియాల్ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల తల్లిదండ్రులకు అవగాహన సదస్సు

రెడ్డి అప్పలనాయుడుకు అభినందనల వెల్లువ

Select Suryaa Now
రెడ్డి అప్పలనాయుడుకు అభినందనల వెల్లువ

ఏలూరు, మేజర్ న్యూస్: ఏలూరు మున్సిపల్ కార్పోరేషన్ మేయర్ గా ఎన్డీఏ కూటమి బలపరిచిన జనసేన పార్టీ అభ్యర్థి రెడ్డి అప్పలనాయుడు ఏలూరు నగర మేయర్ గా 44,661 ఓట్ల భారీ మెజారిటీ తో ఘన విజయం సాధించిన శుభ సందర్బంగా శుక్రవారం ఏలూరు జనసేన పార్టీ కార్యాలయంలో మరియు రెడ్డి అప్పలనాయుడు  నివాసంలో నూతనంగా గెలిచినా కార్పోరేటర్ అభ్యర్థులు, రెడ్డి అప్పలనాయుడు అభిమానులు, నగర మేయర్ రెడ్డి అప్పలనాయుడును, జనసేన నాయకులు నారా శేషును మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.. ఏలూరు నగర మేయర్ గా తన విజయానికి పూర్తి బాధ్యతలు తీసుకొని అహర్నిశలు కృషి చేసిన ఎమ్మెల్యే బడేటి చంటికి, జనసేన నాయకులు నారా శేషు కు, ఇతర కూటమి పార్టీల శ్రేణులకు ఆయన ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.. రెండున్నర ఏళ్ళ కూటమి ప్రభుత్వ సుపరిపాలనకు ఏలూరు కార్పోరేషన్ ఎన్నికల ఫలితాలే నిదర్శనం అని అన్నారు.. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా చైతన్యవంతమైన ట్రిపుల్ ఇంజిన్ సర్కారు పాలన సాగుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.. నగర పాలనలో కార్పోరేటర్ల గౌరవాన్ని మరింత పెంచేలా ప్రజా సమస్యలు పరిష్కారానికి ప్రాధాన్యతను ఇస్తూ ముందుకు సాగుతామని స్పష్టం చేశారు.. ఈ సందర్భంగా ఏలూరు అభివృద్ధే తన లక్ష్యం అని రెడ్డి అప్పలనాయుడు పేర్కొన్నారు.. శుభాకాంక్షలు తెలిపిన వారిలో నూతనంగా ఎన్నికైన పలువురు కార్పోరేటర్లు, పలువురు కూటమి పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు, జనసేన శ్రేణులు, పలువురు కుల సంఘాల నాయకులు తదితరులు ఉన్నారు.