BREAKING
కల్వకోల్ సల్లగరిగే చెరువుకు కేఎల్ఐ నీరు చేరేలా చర్యలు బ్రిక్స్ వారోత్సవాల కార్యక్రమం రైతు మేళాను విజయవంతం చేయాలి.. ఏర్పాట్లలో ఎలాంటి లోటుపాట్లు ఉండకూడదు: జిల్లా కలెక్టర్ దీపక్ తివారి కోహెడ మండల అభివృద్ధికి బీజేపీ నాయకులు అడ్డుపడటం సరైనది కాదు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శెట్టి సుధాకర్ చిన్నారుల ముఖాల్లో దీపావళి వెలుగులు హంగేరీ పర్యటనలో కేంద్ర మంత్రి జితిన్ ప్రసాద జిల్లాలో నూనెగింజల ఉత్పత్తి అభివృద్ధికి సహకరించాలి కార్పొరేటర్లకు ఎమ్మెల్యే ఆరణి అభినందనలు 2026లోనూ 1.5 డిగ్రీల సెల్సియస్ పరిమితి దాటే అవకాశం బియ్యం కేటాయింపు లక్ష్యాన్ని 50 లక్షల టన్నులకు పెంచిన కేంద్రం ​డా. కె. రాజారెడ్డి సేవలు చిరస్మరణీయం కోవిడ్ వ్యాక్సిన్లకు విపరీతమైన డిమాండ్ మీథేన్ నిబంధనల అమలును ఏడాది పాటు వాయిదా వేసిన ఐరోపా సమాఖ్య హిమ్స్ అండ్ హెర్స్ ప్లాట్‌ఫారమ్‌ ద్వారా నేరుగా ఊబకాయం మందులను విక్రయించనున్న ఎలి లిల్లీ గిరిజన సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక గుస్సాడి దండారి ఉత్సవాలు - జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్

పోలింగ్ తరహాలోనే కౌంటింగ్ ప్రశాంతంగా జరగాలి - పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశాం: జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు

Select Suryaa Now
పోలింగ్ తరహాలోనే కౌంటింగ్ ప్రశాంతంగా జరగాలి  - పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశాం: జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు
 
అవనిగడ్డ, మేజర్ న్యూస్: జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసిన తరహాలోనే ఓట్ల లెక్కింపు ప్రక్రియ కూడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా శాంతియుతంగా పూర్తి కావాలని జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు స్పష్టం చేశారు. అవనిగడ్డలోని కౌంటింగ్ కేంద్రాలను శుక్రవారం క్షేత్రస్థాయిలో పరిశీలించిన ఆయన భద్రతా ఏర్పాట్లపై పోలీసు, రెవెన్యూ అధికారులకు పలు సూచనలు చేశారు.
జిల్లా వ్యాప్తంగా మొత్తం ఎనిమిది కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయగా, వాటిలో రెండు ప్రధాన కేంద్రాలు అవనిగడ్డలోనే ఉన్నాయని ఎస్పీ తెలిపారు. స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల, ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఏర్పాటు చేసిన ఈ కేంద్రాల్లో ఐదు మండలాలకు సంబంధించిన ఓట్లను లెక్కించనున్నట్లు వెల్లడించారు.
కౌంటింగ్ సజావుగా నిర్వహించేందుకు జిల్లా వ్యాప్తంగా అన్ని కేంద్రాల వద్ద వెయ్యి మందికి పైగా సిబ్బందితో పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కేంద్రాల పరిసర ప్రాంతాల్లో నిరంతర నిఘా కొనసాగిస్తామన్నారు. ఎన్నికల విధులకు సంబంధించి అధికారిక గుర్తింపు కార్డులు కలిగిన సిబ్బందిని మాత్రమే కౌంటింగ్ కేంద్రాల్లోకి అనుమతిస్తామని, ఇతరులకు ప్రవేశం ఉండదని స్పష్టం చేశారు.
కేంద్రాల వద్ద ట్రాఫిక్ ఇబ్బందులు, రద్దీ నివారణకు ప్రత్యేక పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా ఎవరైనా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఈ పరిశీలనలో అవనిగడ్డ డీఎస్పీ అభిషేక్, సీఐలు యువకుమార్, ఈశ్వరరావు, ఎస్‌ఐలు శ్రీనివాస్, రాజేష్ తదితరులు పాల్గొన్నారు.
✍️ అజంతా శ్రీనివాస్, అవనిగడ్డ, కృష్ణాజిల్లా.