BREAKING
డాక్టర్ యస్ ఆర్ జె డిగ్రీ కళాశాలలో ఫ్రెషర్స్ డే ప్రజాస్వామ్యాన్ని అడ్డుకునేందుకు వైసీపీ ఎన్ని కుట్రలు చేసినా ప్రజాతీర్పును అడ్డుకోలేరు : మంత్రి ఆనం గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తికి తీవ్ర గాయాలు మహారాజా కళాశాలలో ఎంసీఐసీ కేంద్రం ప్రారంభం... శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయంలో ఘనంగా రాహుకాల పూజలు, ప్రదోషకాల అభిషేకాలు విధేయతకు పట్టం..... గురాన రాధికకు "డిప్యూటీ" పీఠం ? కారంచేడు, పర్చూరు ప్రాంతాల్లో విద్యుత్ వ్యవస్థను పరిశీలించిన APCPDCL సీఎజీఎం (ప్రాజెక్ట్స్) కె. లింగమూర్తి ఆకాశంలో పక్షుల విన్యాసం.. కలువాయిలో ప్రకృతి కనువిందు! దళితుల అభ్యున్నతికి ఐక్యంగా కృషి చేయాలి ఏపీ దళిత వేదిక రాష్ట్ర కన్వీనర్ బండపల్లి కేశవరావు జిల్లా అధ్యక్షుడిగా రాజా ఎన్నిక.. 100 మంది పేద మహిళలకు చీరల పంపిణీ ఎంపీపీ పీఠం ఎవరి పరం.. మళ్లీ లాటరీ తప్పదా? తిరుపతి మేయర్ శ్రీనివాస్ కి శుభాకాంక్షలు తెలియ చేసిన... పోనగంటి భాస్కర్ జగన్‌కు షాక్: నవంబర్ 11న కొత్త పార్టీ ప్రకటించనున్న విజయసాయిరెడ్డి ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాలకు కేసీఆర్‌ ప్రత్యేక గుర్తింపు కల్పించారు - మాజీ మంత్రి జోగు రామన్న. ఈనెల 30ననవలారచయిత యండమూరి వీరేంద్రనాథ్ కు గురజాడ విశిష్ట పురస్కారం ప్రదానం అవినీతి నిర్మూలనకు పారదర్శకతే కీలకం - జీఎం మునిగంటి శ్రీనివాస్

కల్వకోల్ సల్లగరిగే చెరువుకు కేఎల్ఐ నీరు చేరేలా చర్యలు

Select Suryaa Now
కల్వకోల్ సల్లగరిగే చెరువుకు కేఎల్ఐ నీరు చేరేలా చర్యలు

పెద్దకొత్తపల్లి. సూర్య న్యూస్: మండల పరిధిలోని కల్వకోల్ గ్రామంలోని సల్లగరిగే చెరువుకు కేఎల్ఐ కాలువ ద్వారా నీరు చేరకపోవడంతో స్పందించిన గ్రామ సర్పంచ్ బంట్రోత్ శ్రీనివాసులు ప్రత్యేక చొరవ తీసుకున్నారు. ఆయన ఆధ్వర్యంలో చేన్నపురావుపల్లి నుంచి కల్వకోల్ వరకు కాలువ వెంట పర్యవేక్షిస్తూ నీటి ప్రవాహానికి అడ్డుగా ఉన్న చెత్తాచెదారం, రాళ్లను తొలగించారు. కాలువలో నీరు సజావుగా ప్రవహించి సల్లగరిగే చెరువుకు చేరేలా శ్రమించారు. చెరువులోకి కేఎల్ఐ నీరు చేరితే రైతులకు సాగునీటి ఇబ్బందులు తగ్గడంతో పాటు పశువులకు నీటి సౌకర్యం కలుగుతుందని గ్రామస్తులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. గ్రామ ప్రయోజనాల కోసం సర్పంచ్ స్వయంగా ముందుకు వచ్చి పనులు చేపట్టడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నల్లవెల్లి రాములు, అమ్మపల్లి బిచ్చన్న, మొట్ట వెంకటస్వామి, నూనె వెంకటేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.