BREAKING
జొన్నవాడ కామాక్షితాయి దేవస్థానంలో వైభవంగా ప్రదోష కాల వృషభార్చన కుమారుడి పుట్టినరోజు... దేవాలయ నిర్మాణానికి రూ.51 వేల విరాళం విద్యార్థుల ఆరోగ్యంపై అప్రమత్తంగా ఉండాలి.. నిరంతర పర్యవేక్షణ చేపట్టాలి! గ్రామంలో జలసిరి, అభివృద్ధి పనుల గుర్తింపు... కూలీలకు అవగాహన రెజీనా బ్రేకప్ వివాదం.. నమ్మిన వ్యక్తి చేతిలో మోసపోయానంటూ నటి సంచలన నిజాలు! పేదలకు అండగా అబ్దుల్ కలాం హెల్పింగ్ హ్యాండ్స్ ట్రస్ట్! వైసీపీకి ప్రత్యర్ధులు కూటమి కాదు పోలీసులే. వెల్దుర్తి సీహెచ్‌సీని తనిఖీ చేసిన ఎన్‌హెచ్‌ఎం బృందం రోగులకు నాణ్యమైన వైద్యం అందించాలి ఆకస్మిక తనిఖీ నిర్వహించిన జాతీయ ఆరోగ్య మిషన్‌ రాష్ట్ర బృందం పాతపట్నంలో ఎన్నికల అధికారుల ఘోర వైఫల్యం లైసెన్స్ లేకుండా టపాసుల వ్యాపారం చేస్తే కఠిన చర్యలు! కలెక్టర్‌కు వినతిపత్రం అందజేసిన వైఎస్సార్‌సీపీ మర్రిపాడు జడ్పీటీసీ అభ్యర్థి సిద్దంరెడ్డి వెంకటరమణమ్మ టాలీవుడ్ నటి సంచలన అరెస్ట్.. డాక్టర్‌ను ఫ్లాట్‌కు పిలిచి బెదిరించి దోపిడీ చేసిన అతుల్య చంద్ర! ఈఈ మెరిట్ టెస్ట్–2027 పాఠశాలల రిజిస్ట్రేషన్ ప్రారంభించిన కన్వీనర్ పుట్టంరాజు. దీక్షితార్ 191 వ దివ్యస్మరణ విద్యారంగంలో డా. రాజారెడ్డి అందించిన సేవలు గొప్పవి - సంతాప సభలో వక్తలు

డాక్టర్ యస్ ఆర్ జె డిగ్రీ కళాశాలలో ఫ్రెషర్స్ డే

Select Suryaa Now
డాక్టర్ యస్ ఆర్ జె డిగ్రీ కళాశాలలో  ఫ్రెషర్స్ డే

ఆత్మకూరు, మేజర్ న్యూస్ :  ఆత్మకూరులోని డాక్టర్ ఎస్ ఆర్ జె డిగ్రీ కాలేజీ లో శుక్రవారం ఫ్రెషర్స్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు.మధుసూదన్ రెడ్డి, ఇన్చార్జి ప్రిన్సిపాల్ డా. టి శ్రీనివాసులు రెడ్డి, ప్రోగ్రాం ఆర్గనైజర్ మరియు వ్యాఖ్యాత గా కళాశాల పిడి సిరిమామిళ్ళ వెంకటేశ్వర్లు వ్యవహరిస్తూ పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మధుసూదన్ రెడ్డి శ్రీనివాసులు రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు ఎన్నో ఆశలు ఆశయాలతో కళాశాలల్లో ప్రవేశం పొందుతారని దానికి అనుగుణంగా విద్యార్థులను ప్రోత్సహించి తీర్చిదిద్దడానికి అధ్యాపకులు అలుపెరుగని కృషి చేస్తారన్నారు. చదువంటే మార్కులు సాధించడం మాత్రమే కాదని, సమాజం పట్ల అవగాహన పెంచుకోవడం, విజ్ఞానాన్ని పెంపొందించుకోవడం, లీడర్ షిప్ పెంపొందించుకోవడానికి అవసరమైన క్రీడల్లో పాల్గొనడం మరియు  
కో కరికులార్ యాక్టివిటీస్లో పాల్గొనేలా ప్రోత్సహించాలన్నారు. డిగ్రీ పూర్తయ్యే నాటికి విద్యార్థులు తమ తమ నైపుణ్యాలను పెంపొందించుకోవాలని ఉద్యోగ అవకాశాలను అందిపుచ్చుకొనేలా తయారవ్వాలన్నారు. 
పిడి సిరిమామిళ్ళ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ 
విద్యాలయాల్లో అధ్యాపకులు విద్యార్థుల హృదయాల్లో జ్ఞాన జ్యోతులను వెలిగించి జీవిత పర్యంతం వారు ఉన్నత ప్రమాణాలతో ఉన్నతమైన జీవితాన్ని గడిపేలా తీర్చిదిద్దుతారన్నారు. మధ్య మధ్యలో సిరిమామిళ్ళ కవితలు విద్యార్థులను సభికులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఆయన చెప్పిన కవిత 
                  “అమ్మంటే”
తన మాంసం, నెత్తురు ముద్దగ చేసి,
ప్రకృతి మెచ్చిన ఆకృతిగ  మలచి,
జన్మనిచ్చే అమృత భాండం "అమ్మ"
ముసి,ముసి నవ్వులు పూయించి,
బుడి,బుడి అడుగులు వేయించి,
బ్రతుకు పాఠం నేర్పేది "అమ్మ"
పుట్టిన బిడ్డలు యింతింతై తనముందే..
తననుమించి ఎదుగుతుంటే...
తన్మయత్వంతో పరవసించేది "అమ్మ"
ఒక్క మాటలో చెప్పాలంటే....
తన బిడ్డల ఆయురారోగ్యాలకోసం
తను వాలిపోతూ...
"అమృతం" పూచే కోమ్మరా "అమ్మ" అని విన్పించారు.
ఈ కార్యక్రమంలో అద్యాపకులు రమణయ్య, 
కాత్యాయని, సుప్రియ, వెంకట్రావు, శ్రీనివాసులు, 
వి. రవీంద్ర, రాజమోహన్, విజయ కుమారి, కొండయ్య మరియు విద్యార్థులు పాల్గొన్నారు.