జొన్నవాడ కామాక్షితాయి దేవస్థానంలో వైభవంగా ప్రదోష కాల వృషభార్చన
నెల్లూరు, కల్చరల్, మేజర్ న్యూస్ : శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన జొన్నవాడ శ్రీ మల్లికార్జున స్వామి సమేత కామాక్షితాయి దేవస్థానంలో శుక్రవారం సాయంత్రం అధికార రాతి నందీశ్వరునికి ప్రదోష కాల వృషభార్చన కార్యక్రమం అత్యంత వైభవంగా, భక్తిశ్రద్ధలతో జరిగింది. పవిత్ర ప్రదోష సమయాన్ని పురస్కరించుకుని ఆలయ ప్రధాన అర్చకులు, వేద పండితులు శాస్త్రోక్తంగా వేద మంత్రోచ్ఛారణల నడుమ నందీశ్వరునికి విశేష అభిషేకాలు, పవిత్ర పుష్పార్చనలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనార్థం విచ్చేసిన భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని నందీశ్వరుని దర్శించుకుని, స్వామివారి కృపాకటాక్షాలతో పాటు తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో దేవస్థాన చైర్మన్ తిరుమూరు అశోక్ రెడ్డి, సహాయ కమీషనరు, కార్యనిర్వహణాధికారి అర్వభూమి వెంకట శ్రీనివాసులు రెడ్డి, దేవస్థాన ధర్మకర్త మండలి సభ్యులు సుధాకర్, ఇతర ఆలయ సిబ్బంది, స్థానిక భక్తులు పాల్గొన్నారు.