- కౌన్సిలర్ చౌదరి చరితకు తండ్రి సుప్రభాతరావు అనుభవం అండ
రామాయంపేట;పజలకు అవసరమైన మౌలిక వసతులు కల్పించడంతో పాటు సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ భాగస్వాములైనప్పుడే ప్రజాప్రతినిధులకు నిజమైన గుర్తింపు లభిస్తుంది. ఇదే లక్ష్యంతో రామాయంపేట మున్సిపాలిటీలోని ఐదో వార్డు కౌన్సిలర్ చౌదరి చరిత తనదైన శైలిలో ముందుకు సాగుతున్నారు. వార్డు ప్రజల సమస్యలను తెలుసుకుంటూ, వాటి పరిష్కారానికి ప్రాధాన్యతనిస్తూ ఐదో వార్డును పట్టణంలోనే ప్రత్యేకంగా నిలిపేందుకు కృషి చేస్తున్నారు. రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం కలిగిన తండ్రి చౌదరి సుప్రభాతరావు మార్గదర్శకత్వం ఆమెకు తోడవుతోంది.అభివృద్ధి పనులతో పాటు విద్యా సంస్థలకు చేయూత, విద్యార్థుల సంక్షేమానికి సహకారం అందించడం ద్వారా ప్రజా సేవకు మరో కోణాన్ని జోడిస్తున్నారు చౌదరి చరిత. వార్డు అభివృద్ధిని నిరంతర ప్రక్రియగా భావిస్తూ, ప్రజల అవసరాలకు అనుగుణంగా మరిన్ని కార్యక్రమాలు చేపట్టాలనే దిశగా ఆమె చేస్తున్న ప్రయత్నాలు ఐదో వార్డుకు ప్రత్యేక గుర్తింపును తీసుకువస్తున్నాయి.ఐదవ వార్డు కాలనీల రూపురేఖల్లో మార్పు..ఐదో వార్డులోని రెడ్డి కాలనీతో పాటు సమీప ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యతనిచ్చారు. చౌదరి సుప్రభాతరావు చొరవతో అందుబాటులోకి వచ్చిన మెరుగైన రహదారులు, అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ స్థానికులకు ఎంతో ఉపయోగకరంగా మారాయి. గతంలో ఎదురైన పారిశుద్ధ్య, రహదారి సమస్యలకు పరిష్కారం చూపే దిశగా చేపట్టిన పనులతో కాలనీల రూపురేఖల్లో మార్పు కనిపిస్తోంది. అభివృద్ధి పనులకే పరిమితం కాకుండా వార్డు ప్రజలతో మమేకమవుతూ వారి అవసరాలకు అనుగుణంగా ముందుకు సాగడం చరిత ప్రత్యేకతగా నిలుస్తోంది.విద్యార్థులకు స్వచ్ఛమైన తాగునీటి సౌకర్యం…సామాజిక సేవలో భాగంగా విద్యార్థుల ఆరోగ్యానికి ప్రాధాన్యతనిస్తూ చౌదరి చరిత కుటుంబం మరో ముందడుగు వేసింది. రామాయంపేట పట్టణంలోని అశోక్ సింఘాల్ సరస్వతి శిశు మందిరం పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు శుద్ధి చేసిన తాగునీరు అందించాలనే ఉద్దేశంతో గంటకు 100 లీటర్ల నీటిని శుద్ధి చేసే సామర్థ్యం కలిగిన వాటర్ ప్యూరిఫైయర్‌ను సొంత నిధులతో ఏర్పాటు చేశారు.ఐదో వార్డు కౌన్సిలర్ చౌదరి చరిత కుటుంబ సభ్యుల సహకారంతో సమకూర్చిన ఈ పరికరాన్ని శుక్రవారం ప్రారంభించారు. చౌదరి సుప్రభాతరావు, పృథ్వీరావు, వాసవి, మౌనికలు ఈ కార్యక్రమంలో భాగస్వాములయ్యారు. పాఠశాలకు వచ్చే చిన్నారులకు పరిశుభ్రమైన తాగునీరు అందుబాటులో ఉండాలనే సంకల్పంతో ఈ సేవా కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థల్లో విద్యార్థుల కనీస అవసరాలపై దృష్టి సారించాల్సిన అవసరం ఉన్న తరుణంలో వ్యక్తిగతంగా ముందుకొచ్చి ప్యూరిఫైయర్ ఏర్పాటు చేయడం పలువురి ప్రశంసలు అందుకుంటోంది.వాటర్ ప్యూరిఫైయర్ ప్రారంభోత్సవం అనంతరం విద్యార్థులకు స్నాక్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ కవిత, ఉపాధ్యాయులు కార్యక్రమంలో పాల్గొని సహకరించిన కుటుంబ సభ్యులకు అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ కవిత .యుగేందర్ రావు .దోమకొండ యాదగిరి, వినయ్ సాగర్, యుగంధర్ రావు, మహేష్, ఎనిశెట్టి రమణదారం శంకర్ తదితరులు పాల్గొన్నారు.