BREAKING
మోదీ అభివృద్ధి, సంక్షేమ పాలనకు ఆకర్షితులై బీజేపీలో చేరిన 10 కుటుంబాలు ఇందిరమ్మ ఇళ్లును ప్రాంభించిన ఎంల్ఏ రోహిత్ రావు దలేర్ మెహందీపై అభిజీత్ భట్టాచార్య వ్యాఖ్యలు.. తీవ్రంగా స్పందించిన కుమారుడు గుర్‌దీప్! దివ్యాంగుల సమస్యల పరిష్కారానికి కృషి.. అర్హులకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యేలా చూస్తాం: స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పాత్రికేయులపై దౌర్జన్యం * సెల్‌ఫోన్లు లాక్కొన్నా చర్యల్లేవా? * టీడీపీ మున్సిపల్ చైర్మన్ త్రివేంద్ర నాయుడుకు ఘన సన్మానం బిగ్‌బాస్ సరికొత్త చరిత్ర.. అరవై రోజుల్లోనే వంద కోట్ల గంటల వ్యూయర్‌షిప్‌తో రికార్డు! కోటబొమ్మాళి వసతి గృహాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన జూనియర్ సివిల్ జడ్జి పందుల పెంపకందారుల కుటుంబాలకు ప్రత్యామ్నాయ జీవనోపాధి కల్పించాలి.. సమస్యలపై సానుకూలంగా స్పందించిన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ టైగర్ ష్రాఫ్ తీవ్ర ఒత్తిడిలో ఉన్నాడు.. ఫైరింగ్ ఘటన తర్వాత కోలుకునేందుకు ప్రయత్నిస్తున్నాడన్న విద్యుత్ జమ్వాల్! నేడు పలాస డివిజన్ లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఓట్ల లెక్కింపు పాచిపెంట వెలుగు కార్యాలయంలో దస్త్రాలు పరిశీలన సీఐఐ సదస్సు ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించిన స్పెషల్ సీఎస్ ఎస్.ఎస్. రావత్ ఘనంగా శ్రీ ధన్వంతరి నారాయణ జయంతి వేడుకలు. సీఐఐ భాగస్వామ్య సదస్సుకు పటిష్ట ఏర్పాట్లు

పాతపట్నంలో ఎన్నికల అధికారుల ఘోర వైఫల్యం

Select Suryaa Now
పాతపట్నంలో ఎన్నికల అధికారుల ఘోర వైఫల్యం

పాతపట్నం, సూర్య : శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండల కేంద్రంలో ఎన్నికల అధికారుల అలసత్వం, సమన్వయ లోపం పరాకాష్టకు చేరి ప్రజాస్వామ్య వ్యవస్థకే మాయని మచ్చగా నిలిచింది. పవిత్రమైన ఓటు హక్కును వినియోగించుకోవాలన్న బలమైన ఆకాంక్షతో పోలింగ్ కేంద్రాలకు బారులు తీరిన సాధారణ ఓటర్లకు తీవ్ర నిరాశే మిగిలింది. కనీస బాధ్యతగా ప్రతి ఇంటికీ చేరవేయాల్సిన ఓటర్ సమాచార స్లిప్పులను పంపిణీ చేయడంలో సంబంధిత సిబ్బంది ఘోరంగా విఫలమవడంతో వందలాది మంది ఓటు హక్కును వినియోగించుకోలేక తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. క్షేత్రస్థాయిలో ఓటర్లకు మార్గదర్శనం చేయాల్సిన బూత్ లెవల్ అధికారులను (BLO) ముందుగానే గుర్తించి నియోజకవర్గ వ్యాప్తంగా ఓటర్ స్లిప్పులు అందించే పనికి పురమాయించాల్సింది పోయి, వారిని ఏకపక్షంగా ఇతర ప్రాంతాలకు పోలింగ్ సిబ్బందిగా (OPO, APO) ఎలా నియమిస్తారంటూ స్థానిక ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బిఎల్ఓలు పోలింగ్ విధులకు వెళ్లిపోవడంతో గ్రామాల్లో ఓటర్ స్లిప్పులు పంచేవారే కరువై, పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్ల జాబితాలో తమ పేర్లు వెతుక్కోలేక గ్రామీణులు, వృద్ధులు, మహిళలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అధికారులలో అవగాహన లోపించడం, క్షేత్రస్థాయి వాస్తవాలను పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లనే ఇంతటి తీవ్ర అన్యాయం జరిగిందని, తాము ఎంతో ఆశగా ఎదురుచూసిన ఓటు హక్కును కోల్పోయామని బాధిత ఓటర్లు కంటతడి పెట్టారు. ఈ దారుణ వైఫల్యం మరియు పరిపాలనాపరమైన నిర్లక్ష్యంపై జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహమ్మద్ ఖాన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం వహించిన అధికారులపై విచారణకు ఆదేశించారు. ప్రజాస్వామ్య హక్కును కాలరాసేలా బాధ్యతారహితంగా ప్రవర్తించి, ఎన్నికల నిర్వహణను గందరగోళానికి గురిచేసిన బాధ్యులైన అధికారులను తక్షణమే గుర్తించి వారిపై కఠిన శాఖాపరమైన మరియు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పాతపట్నం ప్రజలు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు మరియు ప్రజాప్రతినిధులు ముక్తకంఠంతో డిమాండ్ చేస్తున్నారు.