BREAKING
పురపాలక సంఘం ఎన్నికలపై ఎంఎల్‌ఏ సమీక్ష మోదీ అభివృద్ధి, సంక్షేమ పాలనకు ఆకర్షితులై బీజేపీలో చేరిన 10 కుటుంబాలు ఇందిరమ్మ ఇళ్లును ప్రాంభించిన ఎంల్ఏ రోహిత్ రావు దలేర్ మెహందీపై అభిజీత్ భట్టాచార్య వ్యాఖ్యలు.. తీవ్రంగా స్పందించిన కుమారుడు గుర్‌దీప్! దివ్యాంగుల సమస్యల పరిష్కారానికి కృషి.. అర్హులకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యేలా చూస్తాం: స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పాత్రికేయులపై దౌర్జన్యం * సెల్‌ఫోన్లు లాక్కొన్నా చర్యల్లేవా? * టీడీపీ మున్సిపల్ చైర్మన్ త్రివేంద్ర నాయుడుకు ఘన సన్మానం బిగ్‌బాస్ సరికొత్త చరిత్ర.. అరవై రోజుల్లోనే వంద కోట్ల గంటల వ్యూయర్‌షిప్‌తో రికార్డు! కోటబొమ్మాళి వసతి గృహాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన జూనియర్ సివిల్ జడ్జి పందుల పెంపకందారుల కుటుంబాలకు ప్రత్యామ్నాయ జీవనోపాధి కల్పించాలి.. సమస్యలపై సానుకూలంగా స్పందించిన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ టైగర్ ష్రాఫ్ తీవ్ర ఒత్తిడిలో ఉన్నాడు.. ఫైరింగ్ ఘటన తర్వాత కోలుకునేందుకు ప్రయత్నిస్తున్నాడన్న విద్యుత్ జమ్వాల్! నేడు పలాస డివిజన్ లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఓట్ల లెక్కింపు పాచిపెంట వెలుగు కార్యాలయంలో దస్త్రాలు పరిశీలన సీఐఐ సదస్సు ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించిన స్పెషల్ సీఎస్ ఎస్.ఎస్. రావత్ ఘనంగా శ్రీ ధన్వంతరి నారాయణ జయంతి వేడుకలు.

విద్యార్థుల ఆరోగ్యంపై అప్రమత్తంగా ఉండాలి.. నిరంతర పర్యవేక్షణ చేపట్టాలి!

Select Suryaa Now
విద్యార్థుల ఆరోగ్యంపై అప్రమత్తంగా ఉండాలి.. నిరంతర పర్యవేక్షణ చేపట్టాలి!

శ్రీకాకుళం/మన్యం జిల్లా పార్వతీపురం, సూర్య : పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం మండలం శివన్నపేటలోని ఏపిటిడబ్ల్యూఆర్ఎస్, యుఆర్జేసీ గురుకుల వసతి పాఠశాలలో విద్యార్థులకు జ్వరాలు, జలుబు, దగ్గు లక్షణాలు కనిపించిన నేపథ్యంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అప్రమత్తమయ్యారు. విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిపై జిల్లా కలెక్టర్ డా. ఎన్. ప్రభాకర రెడ్డి, వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులతో మాట్లాడి తాజా పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, ప్రతి విద్యార్థి ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించాలని అధికారులను ఆదేశించారు. జ్వర లక్షణాలతో బాధపడుతున్న విద్యార్థులకు తక్షణమే మెరుగైన వైద్య సేవలు అందించాలని, అవసరమైన మందులు, వైద్య సదుపాయాలు అందుబాటులో ఉంచాలని స్పష్టం చేశారు.
గురుకుల పాఠశాలలో ప్రత్యేక వైద్య శిబిరం కొనసాగించాలని, వైద్య నిపుణులతో విద్యార్థులకు ఎప్పటికప్పుడు ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలని సూచించారు. అనారోగ్యంతో ఉన్న విద్యార్థులను ప్రత్యేకంగా పర్యవేక్షిస్తూ, ఇతర విద్యార్థులకు ఇన్ఫెక్షన్లు వ్యాపించకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. తాగునీటి నాణ్యత, ఆహార పదార్థాల స్వచ్ఛత, వంటశాల పరిసరాల పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. జ్వరాల వ్యాప్తికి గల కారణాలను గుర్తించేందుకు అవసరమైన పరీక్షలు నిర్వహించి, నివేదికల ఆధారంగా తగిన చర్యలు చేపట్టాలన్నారు.
శివన్నపేట గురుకులంలోనే కాకుండా జిల్లావ్యాప్తంగా అన్ని గురుకుల, సంక్షేమ వసతి పాఠశాలల్లో విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించాలని, ఎక్కడైనా జ్వర లక్షణాలు కనిపిస్తే వెంటనే స్పందించి వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్, వైద్య ఆరోగ్యశాఖ అధికారులకు మంత్రి అచ్చెన్నాయుడు దిశానిర్దేశం చేశారు.విద్యార్థుల ఆరోగ్య భద్రత విషయంలో ఏమాత్రం అలసత్వం ప్రదర్శించరాదని, పరిస్థితి పూర్తిగా సాధారణ స్థితికి వచ్చే వరకు వైద్య బృందాలు నిరంతరం అందుబాటులో ఉండాలని మంత్రి ఆదేశించారు. విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించడంతో పాటు తల్లిదండ్రుల్లో ఆందోళన తొలగించేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని స్పష్టం చేశారు.