BREAKING
పురపాలక సంఘం ఎన్నికలపై ఎంఎల్‌ఏ సమీక్ష మోదీ అభివృద్ధి, సంక్షేమ పాలనకు ఆకర్షితులై బీజేపీలో చేరిన 10 కుటుంబాలు ఇందిరమ్మ ఇళ్లును ప్రాంభించిన ఎంల్ఏ రోహిత్ రావు దలేర్ మెహందీపై అభిజీత్ భట్టాచార్య వ్యాఖ్యలు.. తీవ్రంగా స్పందించిన కుమారుడు గుర్‌దీప్! దివ్యాంగుల సమస్యల పరిష్కారానికి కృషి.. అర్హులకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యేలా చూస్తాం: స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పాత్రికేయులపై దౌర్జన్యం * సెల్‌ఫోన్లు లాక్కొన్నా చర్యల్లేవా? * టీడీపీ మున్సిపల్ చైర్మన్ త్రివేంద్ర నాయుడుకు ఘన సన్మానం బిగ్‌బాస్ సరికొత్త చరిత్ర.. అరవై రోజుల్లోనే వంద కోట్ల గంటల వ్యూయర్‌షిప్‌తో రికార్డు! కోటబొమ్మాళి వసతి గృహాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన జూనియర్ సివిల్ జడ్జి పందుల పెంపకందారుల కుటుంబాలకు ప్రత్యామ్నాయ జీవనోపాధి కల్పించాలి.. సమస్యలపై సానుకూలంగా స్పందించిన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ టైగర్ ష్రాఫ్ తీవ్ర ఒత్తిడిలో ఉన్నాడు.. ఫైరింగ్ ఘటన తర్వాత కోలుకునేందుకు ప్రయత్నిస్తున్నాడన్న విద్యుత్ జమ్వాల్! నేడు పలాస డివిజన్ లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఓట్ల లెక్కింపు పాచిపెంట వెలుగు కార్యాలయంలో దస్త్రాలు పరిశీలన సీఐఐ సదస్సు ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించిన స్పెషల్ సీఎస్ ఎస్.ఎస్. రావత్ ఘనంగా శ్రీ ధన్వంతరి నారాయణ జయంతి వేడుకలు.

గ్రామంలో జలసిరి, అభివృద్ధి పనుల గుర్తింపు... కూలీలకు అవగాహన

Select Suryaa Now
గ్రామంలో జలసిరి, అభివృద్ధి పనుల గుర్తింపు... కూలీలకు అవగాహన
మర్పల్లి, మేజర్ న్యూస్: గ్రామాభివృద్ధితో పాటు రైతులకు, కూలీలకు ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా ధమాస్తాపూర్ గ్రామపంచాయతీలో వివిధ అభివృద్ధి పనుల గుర్తింపు, మార్కింగ్ కార్యక్రమం నిర్వహించారు. ఎంపీడీవో శాంతమ్మ సమక్షంలో గ్రామ సర్పంచ్ సంతోష్ కుమారి యాదగిరి అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది. గ్రామంలో చేపట్టాల్సిన వివిధ రకాల జలసిరి, ఇతర అభివృద్ధి పనులను గుర్తించి వాటికి మార్కింగ్ ఇచ్చారు. ఈ సందర్భంగా రైతులు, కూలీలకు పనుల ప్రాధాన్యత, ఉపాధి అవకాశాలపై అధికారులు అవగాహన కల్పించారు. సోమవారం నుంచి అధిక సంఖ్యలో కూలీలు పనులకు హాజరయ్యేలా అవసరమైన పనులను సిద్ధం చేయాలని సమావేశంలో నిర్ణయించారు. గ్రామంలో కూలీలకు నిరంతరం ఉపాధి కల్పిస్తూ అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని అధికారులు సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీఓ శ్రీనివాస్, ఏపీఓ అంజిరెడ్డి, ఏపీఎం సమ్మయ్య, సీసీ మల్లేశం, టెక్నికల్ అసిస్టెంట్ విష్ణువర్ధన్ రెడ్డి, వెటర్నరీ అసిస్టెంట్ కుమార్, గ్రామపంచాయతీ కార్యదర్శి స్వరూపరాణి, ఉపసర్పంచ్, వార్డు సభ్యులు, రైతులు, కూలీలు తదితరులు పాల్గొన్నారు.