వైసీపీకి ప్రత్యర్ధులు కూటమి కాదు పోలీసులే.
ఉదయగిరి, మేజర్ న్యూస్ : వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి స్థానిక సంస్థ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం ప్రత్యర్థులు కాదని పోలీసులే ప్రత్యర్థులని ఉదయగిరి నియోజకవర్గ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మేకపాటి రాజగోపాల్ రెడ్డి పేర్కొన్నారు శనివారం ఉదయగిరి లో జరిగిన పత్రికా సమావేశం లో ఆయన మాట్లాడుతూ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు పూర్తిగా స్వామికంగా జరిగాయని పోలీసులను అడ్డుపెట్టుకొని కూటమి ప్రభుత్వం అభ్యర్థుల నుంచి నామినేషన్ పత్రాలు ఉపసంభరించుకునేలా చేపించారని ఆయన దుయ్యబట్టారు నామినేషన్ ల మొదలు ఎన్నిక జరిగేంత వరకు కూటమి నాయకులు, పోలీస్ లు అనేక రకాలుగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ని బెదిరించి అనేక ఇబ్బందులకి గురిచేశారు. ఉదయగిరి, సీతారామపురం, దుత్తలూరు, వరికుంటపాడు పాడు మండలాలలో మాకు ప్రత్యర్థులు కూటమి నాయకులు కాదు, ముమ్మాటికీ మాకు ప్రత్యర్థులు పోలీస్ లే అన్నారు. నామినేషన్ సందర్భంగా సీతారామ పురం జడ్పీటీసీ, 7 ఎంపీటీసీ లు, దుత్తలూరు లో 3 ఎంపీటీసీ లు, వరికుంటపాడు లో 2 ఎంపీటీసీ లు ఎమ్మెల్యే కాకర్ల మాటలకు తలోగ్గిన ఉదయగిరి సీఐ, సీతారామ పురం, దుత్తలూరు, ఎస్ ఐ లు మా అభ్యర్థులు ని అనేక రకాలు ఇబ్బందులు, బెదిరింపులు, పోర్జరీ సంతకాలతో ఏకగ్రీవం చేశారు.. వాటిపై న్యాయ పోరాటం చేస్తాం ఇందులో భాగమైన ఏ ఒక్క అధికారి ని వదిలేదు లేదు చట్టం ముందు దోషులుగానిలబెడుతాంఅన్నారు ఇక నిన్న పోలింగ్ రోజున ఉదయగిరి నియోజకవర్గం బిజింపల్లి పల్లి లో పోలింగ్ బూత్ లో సీతారామ పురం మండలం నాయకులకి వారి అనుచరులు కి ఏమి పని అని, అదేవిధంగా తిరుమలపురం లో రిగ్గింగ్ కి ప్రయత్నించడం సిగ్గు చేటు అని, రిగ్గింగ్ చేసేవాళ్ళని వదిలేసి ఉదయగిరి సీఐ మా పార్టీ వారిపై కేసు లు నమోదు చేయడం సరికాదని అన్నారు.అన్నింటి పై న్యాయస్తానాలని ఆశ్రయిస్తామని తెలిపారు. కూటమి నాయకులు ఇంత దౌర్జన్యం, పోలీస్ ల చేత ఎన్నికలు జరిపించే బదులు నామినేట్ చేసుకుని ఉంటే బాగుండేది అని హితవు పలికారు. రిగ్గింగ్ చేయడానికి వచ్చిన రౌడీ మూకాలని వదిలేసి, రిగ్గింగ్ ని అడ్డుకున్న మా పార్టీ ఉదయగిరి మండలం బండగాని పల్లి ఎంపీటీసీ అభ్యర్థి కల్లూరి రవి ని అరెస్ట్ చేయడం దారుణం అని, రేపు ఎన్నికలు కౌంటింగ్ ఉన్నందున మా అభ్యర్థి రవి ని వెంటనే విడుదల చేయాలని మేకపాటి రాజగోపాల్ రెడ్డి గారు కోరారు.ఇన్ని ఇబ్బందులు పెట్టి ,బెదిరింపులు చేసిన పట్టు వదలక పార్టీ అభ్యర్థులు గా పోటీ చేసిన మా హీరోలకి అందుకు సహకారం అందించిన నాయకులు, కార్యకర్తలు కి సెల్యూట్ చేస్తున్నాను అని ఈ సందర్బంగా మేకపాటి రాజగోపాల్ రెడ్డి గారు తెలిపారు. ఉదయగిరి నియోజకవర్గం లో పార్టీ భలం గా ఉందని ఎప్పుడు ఎన్నికలు జరిగిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలుపు తద్యం అని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.