కుమారుడి పుట్టినరోజు... దేవాలయ నిర్మాణానికి రూ.51 వేల విరాళం
ఆధ్యాత్మిక సేవకు ముందుకొచ్చిన తొల్కట్ట శ్రీరాములు
చేవెళ్ల: కుమారుడి పుట్టినరోజును పురస్కరించుకొని దేవాలయ నిర్మాణానికి విరాళం అందజేసి తొల్కట్ట శ్రీరాములు తన ఉదారతను చాటుకున్నారు. చేవెళ్ల మున్సిపాలిటీ పరిధిలోని ఊరేళ్ల వార్డులో నూతనంగా నిర్మిస్తున్న ఊరడమ్మ, మైసమ్మ దేవాలయాల నిర్మాణానికి రూ.51 వేల ఆర్థిక సాయాన్ని అందించారు.
తన కుమారుడు రాకేష్ పుట్టినరోజు సందర్భంగా 1వ వార్డు కౌన్సిలర్ దూత మల్లేష్, 2వ వార్డు కౌన్సిలర్ డప్పు సువర్ణ చందు, వార్డు సభ్యుల సమక్షంలో ఈ విరాళాన్ని అందజేశారు. పుట్టినరోజు వేడుకలను కేవలం సంబరాలకే పరిమితం చేయకుండా, ఆధ్యాత్మిక కార్యక్రమానికి సహకారం అందించడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.
దేవాలయాల నిర్మాణానికి దాతలు స్వచ్ఛందంగా ముందుకు రావడం అభినందనీయమని, ఇలాంటి సహకారంతో నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తవుతాయని వార్డు ప్రజలు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తొల్కట్ట శ్రీరాములు, ఆయన కుమారుడు రాకేష్‌కు వార్డు ప్రజలు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ, వారి కుటుంబం ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.