BREAKING
టాలీవుడ్ నటి సంచలన అరెస్ట్.. డాక్టర్‌ను ఫ్లాట్‌కు పిలిచి బెదిరించి దోపిడీ చేసిన అతుల్య చంద్ర! ఈఈ మెరిట్ టెస్ట్–2027 పాఠశాలల రిజిస్ట్రేషన్ ప్రారంభించిన కన్వీనర్ పుట్టంరాజు. దీక్షితార్ 191 వ దివ్యస్మరణ విద్యారంగంలో డా. రాజారెడ్డి అందించిన సేవలు గొప్పవి - సంతాప సభలో వక్తలు దీపావళి వేళ పేకాట ఆడితే కఠిన చర్యలు సీఐ వెంకటరెడ్డి చుట్టూ నీరు.. మధ్యలో అంగన్వాడీ భవనం: భయంలో పిల్లలు, తల్లిదండ్రులు! టీటీడీ సాధికారిక మండలి ఛైర్మన్ ముద్దాడ రవిచంద్ర. ఎస్‌ఎంజి ఆవరణలో దీపావళి దుకాణాలు - ప్రత్యేక చర్యలు డిఎస్‌పి ఏఐ టెక్నాలజీతో సరికొత్తగా 'కిరికిరి' సినిమా.. పూజా కార్యక్రమాలతో గ్రాండ్‌గా లాంచ్! అక్రమ నిర్బంధాలు, దాడులపై విచారణ జరిపి రీపోలింగ్ నిర్వహించాలి: మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి శిక్షణకు వచ్చిన సిబ్బందికి భోజనం కరువు! నేడు జెడ్పీటీసీ, ఎంపిటిసి ల కౌంటింగ్ సిరిమాను సంబరాలలో శిరీష గానం అనంతపురం (వైఎస్సార్ సీపీ నాయకురాలు లీలావతి మృతి – అంజలి ఘటించిన మేయర్ రమేష్ గౌడ్ వినియోగదారులకు అందుబాటు ధరల్లో దీపావళి టపాసులు

కడెం కెనాల్ నుంచి చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందించాలని బీఆర్ఎస్ రాస్తారోకో

Select Suryaa Now
కడెం కెనాల్ నుంచి చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందించాలని బీఆర్ఎస్ రాస్తారోకో
సూర్య, జన్నారం : కడెం కెనాల్ చివరి ఆయకట్టు వరకు సాగునీరు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం జన్నారం మండల కేంద్రంలో రాస్తారోకో చేపట్టారు. ఇరువైపులా అన్ని రకాల వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో సమాచారం అందుకున్న స్థానిక ఎస్సై ఉదయ్ కిరణ్ తన సిబ్బందితో అక్కడికి చేరుకొని రాస్తారోకోను విరమింపజేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు గుర్రం రాజారాం రెడ్డి మాట్లాడుతూ ఖానాపూర్ నియోజకవర్గం పార్టీ ఇంచార్జి భుక్య జాన్సన్ నాయక్ ఆదేశాల మేరకు రైతుల పక్షాన ఈ రాస్తారోకో కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని అన్నారు. కడెం కెనాల్ నుంచి తక్షణమే నీటిని విడుదల చేసి చివరి ఆయకట్టు వరకు ప్రతి రైతు పొలానికి సాగునీరు అందించాలని డిమాండ్ చేశారు. డిసెంబర్ నెల వరకు పంటలకు నిరంతరాయంగా నీరు అందించి రైతులు ఎంతో కష్టపడి సాగు చేసిన పంటలను కాపాడాలని, రైతులకు నష్టం కలగకుండా చూడాలని కోరారు. అనంతరం రైతు సమస్యలను పరిష్కరించాలని కోరుతూ జన్నారం ఎమ్మార్వో బక్కయ్యకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల యూత్ అధ్యక్షులు పేరం శ్రీనివాస్, ఫజల్ ఖాన్, సుల్వ జనార్ధన్, సుతారి వినయ్ కుమార్, సిటిమల భరత్ కుమార్, బాణావత్ రాములు నాయక్, జాడి గంగాధర్, కళ్లెం శ్రీనివాస్ రెడ్డి, సందీప్ రావు, కనుగంటి దేవయ్య, బాలసాని శ్రీనివాస్ గౌడ్, ఇప్ప రాకేష్, బాదావత్ సాయికిరణ్ తదితరులు పాల్గొన్నారు.