గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తికి తీవ్ర గాయాలు
హిందూపురం: - హిందూపురం నుండి పెనుకొండ వెళ్లే ప్రధాన రహదారిపై నడుంపల్లి సమీపంలో గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో గొల్లపల్లి గ్రామానికి చెందిన వెంకటేష్ (40) తీవ్రంగా గాయపడ్డాడు. ప్రమాదంలో తీవ్ర రక్తస్రావం కావడంతో రహదారి పక్కన అపస్మారక స్థితిలో పడిపోయినట్లు సమాచారం. ప్రమాదానికి కారణమైన వాహనం ఆగకుండా వెళ్లిపోయినట్లు తెలుస్తోంది.
హిందూపురం సూర్య స్టాప్ రిపోర్టర్ నాగేంద్ర