BREAKING
పంజాబ్ కింగ్స్‌లోకి హార్దిక్ పాండ్యా: ముంబై ఇండియన్స్‌కు అర్ష్‌దీప్ సింగ్.. ఐపీఎల్ ట్రేడ్‌లో బిగ్ అప్‌డేట్! రామాయణం'లో సీత పాత్రను సాయి పల్లవి తప్ప ఇంకెవరూ చేయలేరు: ధనుష్ సంచలన వ్యాఖ్యలు నగరం జడ్పిటిసి అభ్యర్థి చింతల సుబ్బారావు 15,694 ఓట్ల మెజార్టీతో గెలుపు రామాయణం'లో చిన్న పాత్ర అయినా నటించడం నాకెంతో గర్వకారణం: కాజల్ అగర్వాల్ భావోద్వేగ వ్యాఖ్యలు పైర్ సినిమాకు ఎదురుదెబ్బ: థియేటర్లలో 75 శాతం షోలను తగ్గించారన్న దర్శకుడు వినోద్ కాప్రీ స్ట్రేంజర్ థింగ్స్ ఫ్యాన్స్‌కు అంచనాలు పెంచే అప్‌డేట్: 1955 కాలం నాటి కథతో 'అదర్ వరల్డ్స్' ప్రీక్వెల్ ప్రకటన త్రికోటేశ్వర క్రాకర్స్ లో అధిక రేట్లు - ప్రజల నుంచి ఫిర్యాదులు, స్పందించాలని డిమాండ్ పిడుగురాళ్ల రూరల్ మేజర్ న్యూస్ పిడుగురాళ్ల రూరల్ పరిధిలోని త్రికోటేశ్వర క్రాకర్స్ షాపులో బాణాసంచా అధిక రేట్లకు విక్రయిస్తున్నారని ప్రజలు, వినియోగదారులు ఆరోపిస్తున్నారు. పండుగ సీజన్ ను ఆసరాగా చేసుకుని ఎంఆర్పీ కంటే బాక్సాఫీస్ వద్ద రామాయణం సరికొత్త రికార్డులు: శనివారం నాటికి రూ.167 కోట్లు దాటిన వసూళ్లు చిట్టమూరు జడ్పీటీసీగా పెళ్లూరు సౌజన్య రెడ్డి ఘన విజయం! 1,820 ఓట్ల భారీ మెజారిటీతో విజయకేతనం ఓమ్: చాప్టర్ 1 - ఉదిరం' మల్టీ-హీరో సినిమా: కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ ఆసక్తికర వ్యాఖ్యలు ఇండస్ట్రీ మనల్ని ఎప్పుడూ అభద్రతాభావానికి గురిచేస్తుంది: ప్రముఖ దర్శకురాలు ఫరా ఖాన్ సంచలన వ్యాఖ్యలు నగరం మండలంలో 14 ఎంపీటీసీ స్థానాలు టీడీపీ కైవసం ప్రతి విద్యార్థి తప్పక చూడాల్సిన చిత్రం 'జయంత్ అండ్ ది జింగో పెన్': ఎమ్మెల్సీ మల్క కొమరయ్య ప్రశంసలు మంచి సినిమాను థియేటర్లలోనే ఆదరించాలి: 'సమ్మర్ హాలిడేస్' థ్యాంక్స్ మీట్‌లో నిర్మాత ధీరజ్ మొగిలినేని భావోద్వేగ వ్యాఖ్యలు ఇంకొల్లు జడ్పీటీసీగా పూజల శ్రీనివాసరావు

విధేయతకు పట్టం..... గురాన రాధికకు "డిప్యూటీ" పీఠం ?

Select Suryaa Now
విధేయతకు పట్టం..... గురాన రాధికకు "డిప్యూటీ" పీఠం ?

విజయనగరం బ్యూరో, సూర్య :  స్థానిక పోరులో ప్రధాన ఘట్టం ముగిసింది. నగరపాలక సంస్థ మేయర్ గా అవనాపు భార్గవి గెలుపొందిన విషయం తెలిసింది. ఇక మరో ప్రాధాన్యత పదవి డిప్యూటీ మేయర్ కాగా ఆ పదవి ఎన్నికకు కూడా ఈ నెల 23న నోటిఫికేషన్ వెలువడింది. దీంతో ఈ పదవిపై ఆశావహుల్లో గుబులు రేగుతోంది. గెలుపొందిన ప్రధాన కూటమి కార్పొరేటర్లు డిప్యూటీ మేయర్ పదవిపై ఎవరి స్థాయిలో వారు పావులు కదుపుతున్నారు. అయితే ఈ పదవి ఎవరికి ఇవ్వాలన్నా అందుకు స్థానిక శాసన సభ్యురాలు అదితి గజపతిరాజు ఆశీస్సులు పుష్కలంగా ఉండాలన్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే డిప్యూటీ మేయర్ గా గురాన రాధికకు అవకాశాలు మెండుగా ఉన్నాయని టౌన్ పబ్లిక్ టాక్. అయితే గురాన రాధికకు ఆ పదవి వరించడం సమంజసమైనదే నని  సర్వత్రా అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నిజానికి ఆమె జనసేన అభ్యర్థిగా తన సమీప అభ్యర్థి పై 500 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఆమె భర్త గురాన అయ్యలు ఎన్నో ఏళ్లుగా నగర రాజకీయాలలో చురుకైన పాత్రను పోషిస్తున్నారు. ఆయన తండ్రి దివంగత గురాన సాధూరావు ప్రముఖ వ్యాపారవేత్తగా, రాజకీయ నాయకులుగా, నగరానికి సేవలు అందించారు. అక్క మీసాల గీత శాసనసభ్యులుగా, మున్సిపల్ చైర్ పర్సన్ గా సుపరిచితులు. సుదీర్ఘ రాజకీయ నేపథ్యమున్న గురాన కుటుంబానికి కోడలుగా వచ్చిన రాధిక డిప్యూటీ మేయర్ గా ప్రకటిస్తే మంచిదే నన్న భావన సర్వత్రా వ్యక్తం అవుతుంది. పొత్తుధర్మంలో జనసేనకు ప్రాధాన్యత ఇచ్చినట్లుగా కూడా ఉంటుందంటున్నారు రాజకీయ పరిశీలకులు. అందునా మంచి కుటుంబం, విధేయత, ఆర్థికంగా, సామాజికంగా అన్ని అంశాలు గురాన రాధిక కు కలిసి వచ్చే అవకాశాలు. గురాన అయ్యలు కూడా నగరంలో సౌమ్యుడన్న  ప్రత్యేక గుర్తింపు ఉంది. రాధిక కూడా అభిమానస్తురాలిగా, దైవభక్తి పారాయణరాలుగా, ముఖ్యంగా విద్యాధికురాలిగా పేరుంది. కావున అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని గురాన రాధికకు డిప్యూటీ మేయర్ గా ప్రకటిస్తే మంచిదని తద్వారా నగర అభివృద్ధిలో కీలక భూమిక కాగలరన్న అభిప్రాయం నగరమంతా నెలకొంది.